జనగామ : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీచే స్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుక ఇవ్వాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన బుధవారం పట్టభద్రుల సమావేశం జరిగింది.
ముఖ్యఅతిథిగా కడియం శ్రీహరి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు, తెలంగాణకు అడ్డుపడిన టీడీపీ మద్దతుతో పోటీలో ఉన్న బీజేపీకి మధ్య జరుగుతున్నాయన్నారు. ఏ ఉపఎన్నికలో కూడా నేరుగా పోటీచేసే ధైర్యం లేకనే టీడీపీ బీజేపీని ముందు పెడుతుందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచిస్తున్నార న్నారు. అభివృద్ధి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు.
భారీ మెజారిటీతో గెలిపించాలి : జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ
టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని జెడ్పీ చైర్‌పర్సన్ పద్మనర్సింగారావు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసిన తర్వాతనే పల్లా అభ్యర్థిత్వాన్ని ప్రకటించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమన్నారు.
అధిక మెజారిటీ ఇస్తాం : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
పల్లా రాజేశ్వర్‌రెడ్డికి జనగామ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హామీఇచ్చారు. జనగామలో విద్యావంతులు ఎక్కువ అని.. వారంతా కేసీఆర్‌కు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారన్నారు. పక్కా ప్రణాళితో ముందుకుసాగి పల్లాకు భారీ ఆధిక్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
దీవెనలు అందించాలి : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
తనకు నిండు దీవెనలు అందించి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పట్టభద్రులను కోరారు. రానున్న రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ కానున్నట్లు తెలిపారు. సమా వేశంలో ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, రాజలింగం, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పార్టీ నియోజవకర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గుజ్జా సంపత్‌రెడ్డి, నర్సింగారావు, కిషన్‌రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రొఫెసర్ సీతారామారావు, వడుప్సా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ప్రసాదరావు, సేవెల్లి సంపత్, బండా యాదగిరిరెడ్డి, మేకల కలింగరాజు, పులి సారంగపాణి, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ లవకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.