
టీఆర్‌ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ: కాంగ్రెస్ నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల వద్దకు వెళుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ.. నల్గొండలో జరిగే సభ చారిత్రాత్మక సభ అవుతుందని అన్నారు. 9 నెలల పాలనను కేసీఆర్ త్యాగం చేశారని కొనియాడారు. టీఆర్‌ఎస్ పార్టీ గతంలో తెలంగాణ సాధించడం కోసం పొత్తు పెట్టుకుందని వ్యాఖ్యానించారు. అడుగడుగునా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు.
ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికూటములు జతకట్టినా టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిని ప్రకటించే దమ్ము ఉందా అని సూటిగా అడిగారు. నల్గొండ జిల్లాలోనే నలుగురు నాయకులు తాము సీఎం అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment