టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలైన తర్వాత జిల్లాల విభజన చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినో రాజకీయంగా దెబ్బతీయడానికి కేసీఆర్ జిల్లాల విభజన చేస్తున్నారన్న రేవంత్ ఆరోపణలు.. పచ్చర్ల కామెర్ల రోగి సామెతను తలపిస్తున్నాయన్నారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి శనివారం టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో సుమన్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయాలు, పనులను రాజకీయ కోణంలో చూడటం టీడీపీకి దిక్కుమాలిన అలవాటుగా మారిందని సుమన్ విమర్శించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్ర క్రియ మొదలైందని రేవంత్ అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.