ఇటీవల నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీపై పోలీసుల నిర్బంధం నేపథ్యంలో తెలంగాణ జేఏసీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది.
హైదరాబాద్: ఇటీవల నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీపై పోలీసుల నిర్బంధం నేపథ్యంలో తెలంగాణ జేఏసీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. నిరుద్యోగుల నిరసన ర్యాలీతోపాటు భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నెల 27న విద్యార్థి, యువజన విభాగాలతో భేటీ కావాలని టీజేఏసీ ఈ సందర్భంగా నిర్ణయించింది.
టీజేఏసీ భేటీ అనంతరం జేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. జేఏసీ చైర్మన్ కోదండరాంను విమర్శించే స్థాయి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని వారే టీజేఏసీపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.