కాంగ్రెస్‌కు సహకరించడమే ఎజెండా
కోదండరాంపై ఎంపీ సుమన్ ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీని లేపి నిలబెట్టాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తాపత్రయపడుతున్నారని, ఏదోరకంగా కాంగ్రెస్‌కు సహకరించడమే ఆయన ఏకైక ఎజెండాగా కనిపిస్తున్నదని ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. కోదండరాం మేధావి ముసుగులో ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని, అయినా అసలు జేఏసీ ఎక్కడుందని ప్రశ్నించారు. శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌తో కలసి సుమన్ శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని కోదండరాం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.