
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సమన్వయ సమితిలో సభ్యులను త్వరలో నియమిస్తామని సీఎం తెలిపారు. క్యాబినెట్ హోదా కలిగిన ఈ పదవికి మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్‌గా నియమితులవడంతో ఆయన స్థానంలో పల్లాను ముఖ్యమంత్రి నియమించారు. మరోవైపు రైతు సంబంధ అంశాలపై మూడు, నాలుగు రోజులలో వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.