
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, బీజేపీ నేతలను గ్రామాల్లో నిలదీస్తామని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. మోదీ కుట్రలను ఛేదించడంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంతుచూస్తామన్నారు.
శాసనమండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే జాజుల సురేందర్‌తో కలిసి శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వరద తగ్గిన తర్వాత మరమ్మతులు చేసి పంపులను వినియోగంలోకి తెస్తుందని రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment