
'చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి'
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబు ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటున్నామని చెప్పారు.