
'దొంగ లెక్కలు చెప్పడంలో ఆయన దిట్ట'
'దొంగ లెక్కలు చెప్పడంలో అమిత్ షా దిట్ట' అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: 'దొంగ లెక్కలు చెప్పడంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమిత్ షా దిట్ట' అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధం లేదన్నారు. సెప్టెంబర్ 17ను బీజేపీ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ.. సెప్టెంబర్ 17ను అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని అన్నారు. కేంద్ర పథకాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేవని చెప్పారు. అరుణాచల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు. 2019లో బీజేపీ అధికారంలోకి వస్తుందనడం హాస్యాస్పదమని పల్లా తెలిపారు.