సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈటల తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకమని వ్యాఖ్యానించారు. కన్నతల్లిలాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశారని ఆయన మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమ ఎజెండా రూపొందించింది కేసీఆర్. నాయకత్వ లక్షణాలు లేకున్నా ఈటలను కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. ఈటలకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడన్నారు.. ఇప్పుడేమో నియంతా?’’ అంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.
‘‘బడుగుబలహీన వర్గాలకు చెందిన భూములను ఈటల ఎలా కొంటారు?. అనామకుడి ఫిర్యాదుపై సీఎం స్పందించారంటే అది ప్రజాస్వామ్యం గొప్ప. ఈటలకు ఆత్మగౌరవంపై కాదు.. ఆస్తులపై గౌరవం ఉంది. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ఆత్మగౌరవ నినాదం. అధికారులను వాడుకుని వారిపైనే నిందలు మోపుతున్నారని’’ పల్లా నిప్పులు చెరిగారు.
ఆస్తులను రక్షించుకోవడానికే ఈటల ప్రయత్నాలు: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఆస్తులను రక్షించుకోవడానికే ఈటల రాజేందర్ ప్రయత్నాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దుయ్యబట్టారు. ఢిల్లీలో ఉన్నవాళ్లు కూడా ఈటలను కాపాడలేరన్నారు. ప్రగతి భవన్ లో అడుగుపెట్ట నివ్వలేదంటూ ఈటల దిగజారుడు మాటలు బడుగు బలహీన వర్గాలు విశ్వసించరని బాలరాజు అన్నారు.
చదవండి: Etela Rajender: టీఆర్‌ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా
కిడ్నాప్ తరహాలో జర్నలిస్ట్ అరెస్టా?: సంజయ్
Comments
Please login to add a commentAdd a comment