
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి లేఖ రాసింది. అనివార్య కారణాలతో పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ వేడుకలు జరపలేమని తెలిపింది. రాజ్‌భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని లేఖలో ప్రభుత్వం పేర్కొంది. దీంతో, ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపిన లేఖపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. కాగా, పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్‌ను ప్రభుత్వం ఎప్పుడూ అవమానించలేదు. రిపబ్లిక్ వేడుకలు ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసు. రాజ్‌భవన్‌లో కూడా ఏర్పాట్లు చేసేది ప్రభుత్వమే. గవర్నర్‌ను సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఒక్క మాట అనలేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రొటోకాల్ పాటిస్తోంది అని స్పష్టం చేశారు.
మరోవైపు.. గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ లేఖపై గవర్నర్ తమిళిసై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం దిక్కరించడంపై పిటిషన్ దాఖలు చేశారు. వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మాధవి ధర్మాసనం విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment