
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో, ఆర్టీసీ విలీనం ప్రక్రియకు లైన్‌క్లియర్ అయ్యింది.
వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్ తమిళిసై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. అయితే, బిల్లులో గవర్నర్ చేసిన 10 సిఫార్సులకు ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో బిల్లుకు తమిళిసై ఆమోదం తెలిపారు. ఇక, నెల రోజుల తర్వాత బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడం విశేషం.
ఇది కూడా చదవండి: ప్రగతిభవన్‌కు నేతల క్యూ
Comments
Please login to add a commentAdd a comment