సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్ సర్కార్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు వాస్తవాలు గ్రహిస్తున్నారని అన్నారు. కేసీఆర్ లక్ష కోట్ల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కాగా, బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి. రాష్ట్ర ప్రభుత్వం మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాట డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అన్న చందంలా తయారైంది. ఆర్టీసీ కార్మికులు వాస్తవాలు గ్రహిస్తున్నారు. ప్రభుత్వం 15-20 కోట్ల ఆర్టీసీ డబ్బులు వాడుకున్నారు. ఆర్టీసీ విలీన బిల్లులో వాటి గురించి లేదు. కార్మికుల సీసీఎస్ డబ్బులు 4500 కోట్లు, పీఎఫ్ డబ్బులు 9వేల కోట్లు వాడుకున్నారు.. అవి ఎవరు ఇస్తారు?. కేసీఆర్ లక్ష కోట్ల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కరీంనగర్, ఆర్మూర్‌లో ఇప్పటికే ఆర్టీసీ ఆస్తులను లీజు పేరుతో కొల్లగొట్టారు. ఆర్టీసీ ఆస్తులను కొట్టేసేందుకు విలీనం పేరుతో డ్రామా ఆడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు బెనిఫిట్ల ప్రస్తావన బిల్లులో లేదు. కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు బయటకు వస్తాయి. ఆర్టీసీ ఉద్యోగుల ఓట్ల కోసమే విలీనం డ్రామా ఆడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు లాభం చేకూరడానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కృషి చేస్తున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి. కేటీఆర్ భాష, అహంకారం చూసి ప్రజలు తిరగబడుతున్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆరా లేక కేటీఆరా?. ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ను ప్రకటిస్తే బీఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరు అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ అధికారుల భేటీ
Comments
Please login to add a commentAdd a comment