
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కూడా రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుపై తప్పుడు ప్రచారం చేయడానికే బీజేపీ దీక్షపేరుతో డ్రామాలాడుతోందని విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన దీక్ష పెద్ద డ్రామా అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, అన్ని రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు, మద్దతు ధర అమలు కోటా పరిమితి లేకుండా రైతులు పండించిన మొత్తం ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు దీక్షలు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment