టీఆర్ఎస్ ఎమ్మెల్సీని అడ్డుకున్న పోలీసులు | MLC attempt to break into a polling station | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఎమ్మెల్సీని అడ్డుకున్న పోలీసులు

Published Sat, Nov 21 2015 8:52 AM | Last Updated on Fri, Mar 22 2019 1:49 PM

MLC attempt to break into a polling station

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేలా ఓ పోలింగ్ కేంద్రంలోకి అనుచరులతో వెళ్లేందుకు ప్రయత్నించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మండల కేంద్రంలోని బాలుర హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్దకు రాజేశ్వర్‌రెడ్డి ఉదయమే వచ్చారు. ఆయన వెంట సుమారు 60 మంది స్థానిక నాయకులు కూడా ఉన్నారు.

 

అందరూ కలసి గుంపుగా లోపలికి వెళుతుండగా స్థానిక ఎస్‌ఐ రాఘవేందర్ సిబ్బందితో కలసి అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం అలా వెళ్లకూడాదని స్పష్టం చేశారు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరు కూడా కానందున.. కావాలంటే 100 మీటర్ల దూరంలో ఉండి పోలింగ్‌ను పర్యవేక్షించుకోవచ్చని సూచించారు. దీంతో రాజేశ్వర్‌రెడ్డి వెనక్కి తగ్గారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement