
లగడపాటి రాజగోపాల్
తెలంగాణ బిల్లును మొదట రాజ్యసభలో పెట్టడం సరికాదని లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు
హైదరాబాద్: తెలంగాణ బిల్లును మొదట రాజ్యసభలో పెట్టడం సరికాదని లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభలోనే బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని విడదీయటం ఎవరివల్ల కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజీనామా చేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు లగడపాటి తెలిపారు.