వరంగల్, న్యూస్‌లైన్ :
అరవై ఏళ్ల కల సాకారమయ్యే క్షణం... అందరి కళ్లల్లో ఒక ఆత్మసంతృప్తి.... పోరాటాలు, త్యాగాలతో దారులు వేశాం... బలిదానాల పీఠమెక్కాం... పాలకులు కనికరిం చారు... ఫలితం సాధించాం... తెలంగాణ సాక్షాత్కరిం చింది. సగటు తెలంగాణ ఉద్యమకారుడిలో మంగళవారం కన్పించిన భావోద్యోగమిది. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో ఓరుగల్లులో తెలంగాణ సంబురాలు అంబరాన్నంటారుు. జిల్లావ్యాప్తంగా తెలంగాణ నినాదాలు మార్మోగాయి. తెలంగాణవాదులు భావోద్వేగానికి గురై ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంబరాల్లో పాలుపంచుకున్నారు. త్యాగధనులను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టారు. వయో భేదం వీడి.. ఇళ్లను విడిచి రోడ్డెక్కారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎల్‌డీ, ఎంఎస్‌పీ, వివిధ ఉద్యోగ, న్యాయవాద, ప్రజా సంఘాలు, టీపీఎఫ్, టీఎన్‌ఎస్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. కళాకారుల ఆటపాటలతో హోరెత్తించగా, యువకులు నృత్యాలు చేస్తూ... రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.
తొలిసారిగా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయం నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ సాగింది.
కాకతీయ యూనివర్సీటీ ఆనందోత్సాహాలతో మునిగితేలింది. కేయూ జేఏసీ, అధ్యాపకులు, సిబ్బంది కేరింతలు కొడుతూ, నృత్యాలు చేశారు.
నిట్, ఆర్ట్స్, లా కళాశాల విద్యార్థులు ర్యాలీలతో హోరెత్తిం చారు. ఉపాధ్యాయులు, కళాకారులు ర్యాలీలు చేశారు.
జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, ములుగు, పరకాల, ఏటూరునాగారం, నర్సంపేట, మహబూబాద్, డోర్నకల్, తొర్రూరు, పాలకుర్తి, మరిపెడ సెంటర్లు తెలంగాణవాదులతో నిండిపోయాయి.
హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద భారీస్థాయి కాగ డా వెలిగించారు. అమరవీరులకు తెలంగాణ వాదులు ఘనంగా నివాళులర్పించారు.
బీజేపీ, కాంగ్రెస్ జిల్లా కార్యాలయాల్లో కార్యకర్తలు సంబ రాలు జరుపుకున్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. సీపీఐ నాయులు, కార్యకర్తలు సంబరాల్లో పాలుపంచుకున్నారు.
హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద న్యాయవాదులు, విద్యుత్, ఉద్యోగ సంఘాల నాయకులు బ్యాండ్ మేళాలతో సంబరాలు చేసుకున్నారు.
పోచమ్మమైదాన్, వరంగల్ చౌరస్తా, హన్మకొండ సెంట ర్లలో అన్ని పక్షాల నాయకులు, బీసీ జేఏసీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఎంజీఎం, కేఎంసీ వద్ద సంబరాలు జరుపుకున్నారు. అమరవీరుల స్థూపాలకు పాలాభిషేకం చేశారు.
హన్మకొండ ఏకశిల పార్కు వరకు తెలంగాణవాదులు ర్యాలీగా వచ్చి... తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మిన్నంటిన సంబురం
Published Wed, Feb 19 2014 5:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement
Advertisement