నియంత అంటే హిట్లర్ కాదు సోనియా: ఈరోజు బ్లాక్డే | Dictator Sonia gandhi: YS Jagan | Sakshi
Sakshi News home page

నియంత అంటే హిట్లర్ కాదు సోనియా: ఈరోజు బ్లాక్డే

Published Tue, Feb 18 2014 4:59 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

నియంత అంటే హిట్లర్ కాదు సోనియా: ఈరోజు బ్లాక్డే - Sakshi

నియంత అంటే హిట్లర్ కాదు సోనియా: ఈరోజు బ్లాక్డే

న్యూఢిల్లీ: నియంత అంటే మనందరికి హిట్లర్ గుర్తుకు వచ్చేవాడని, ఇక ఈ రోజు నుంచి నియంత అంటే సోనియా గాంధీ గుర్తుకు వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. ఈ రోజు లోక్సభలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) ఆమోదం పొందిన తీరును తప్పుపట్టారు.  పాకిస్తాన్లో కూడా ఈ రకంగా ఎవరూ చేయరన్నారు. ఈరోజును బ్లాక్డే ప్రకటించారు. పార్లమెంటులో జరిగిన తీరును చూసిన తరువాత నియంతగా సోనియా గుర్తుకు వస్తారని చెప్పారు. ఈ నియంత పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో రేపు బంద్కు పిలుపు ఇచ్చారు.

ఒక బిల్లు ఆమోదం పొందడం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ స్థాయికి దిగజారిపోతారో ఈ రోజు అర్ధమైందన్నారు. కనీవిని ఎరుగని విధంగా అసెంబ్లీ వ్యతిరేకంగా తీర్మానం చేసినా, లోక్సభలో బిల్లు ప్రవేశ పెట్టారన్నారు. ఒక బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు సభ్యులు ఆమోదిస్తే చేతులు పైకెత్తండి లేకపోతే చేతులు కిందనే ఉంచండి అనే పార్లమెంటు సంప్రదానికి విరుద్దంగా  పదేపది సెకండ్లలో బిల్లును ఆమోదించారని ఆవేదన వ్యక్తం చేశారు. నియంతలా బిల్లును ఆమోదించారన్నారు.  మనం భారతదేశంలో ఉన్నామా? ఈ పోకడ సరైనదేనా? అని ప్రశ్నించారు.  తమని సభలోకి పోనివ్వలేదని చెప్పారు.

ఈ బిల్లు ఆమోదం పొందడానికి ప్రధాన కారణం సోనియా గాంధీ అయితే, రెండవ వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. టిడిపికి చెందినవారు బిల్లుకు అనుకూలంగా ఓటువేశారని తెలిపారు. బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్, బిజెపి, టిడిపి బాధ్యత వహించాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement