కాకినాడ లీగల్, న్యూస్‌లైన్ : అసెంబ్లీలో తిరస్కరించిన తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకూడదంటూ కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ జవహర్ ఆలీ సుప్రీంకోర్టు న్యాయవాది ఎ.రమేష్ ద్వారా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఇరు ప్రాంతాల ప్రజల ఆమోదం లేకుండా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడం చట్టవ్యతిరేకమని, ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని జవహర్ ఆలీ పేర్కొన్నారు. బుధవారం దీనిని విచారణకు స్వీకరించారన్నారు.