చిరంజీవి ప్రకటనను ఎలా చూడాలి?
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై చిరంజీవి ప్రసంగాన్ని బిజెపి, పలు ఇతర పార్టీల సభ్యులు తప్పుపట్టారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మండలి నిర్ణయాన్ని మంత్రిగా ఉన్న చిరంజీవి ఎలా వ్యతిరేకిస్తారని ప్రతిపక్ష బిజెపి నేత అరుణ్ జైట్లీ విమర్శించారు. చిరంజీవి ప్రకటను ఎలా చూడాలని అడిగారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి అవలంభిస్తోందన్నారు.
చిరంజీవి ఎవరి తరపున మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రిగా ఉన్న చిరంజీవి ఎలా వ్యతిరేకిస్తారని అడిగారు. ఆయన ఏ హొదాలో మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. మంత్రిగా ఆయన సొంత అభిప్రాయాలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఓ మంత్రిగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా సవాల్ చేస్తారని అడిగారు. ఆ సవాల్ చేయాలనుకుంటే మందు మంత్రి పదవికి రాజీనామా చేయాలని జైట్లీ చెప్పారు.