యూపీ నుంచి రాజ్యసభకు జైట్లీ | Arun Jaitley To Be Re-Nominated To Rajya Sabha From Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీ నుంచి రాజ్యసభకు జైట్లీ

Published Thu, Mar 8 2018 3:14 AM | Last Updated on Mon, Aug 20 2018 4:55 PM

Arun Jaitley To Be Re-Nominated To Rajya Sabha From Uttar Pradesh - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈసారి ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పోటీచేయనున్నారు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మధ్యప్రదేశ్‌ నుంచి బరిలో నిలవనున్నట్లు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం జైట్లీ గుజరాత్‌కు, ప్రధాన్‌ బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ

చ్చే రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేయనున్న పలువురు కేంద్ర మంత్రులు, ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి జాబితాను కమిటీ విడుదలచేసింది. జైట్లీ, ప్రధాన్‌ కాకుండా మిగిలినవారు (కేంద్ర మంత్రులు థావర్‌చంద్‌ గెహ్లాట్‌ – మధ్యప్రదేశ్, రవిశంకర్‌ ప్రసాద్‌ – బిహార్, జేపీ నడ్డా – హిమాచల్‌ ప్రదేశ్, పురుషోత్తం రూపాలా, మనుసుఖ్‌ మాండవీయా – గుజరాత్‌) గతంలో పోటీచేసిన రాష్ట్రాలనుంచే బరిలో ఉంటారు. మహారాష్ట్ర నుంచి కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పోటీచేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement