బిల్లును అడ్డుకోండి: కారత్కు జగన్ విజ్ఞప్తి | YS Jagan met Prakash Karat | Sakshi
Sakshi News home page

బిల్లును అడ్డుకోండి: కారత్కు జగన్ విజ్ఞప్తి

Published Thu, Feb 6 2014 1:22 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

బిల్లును అడ్డుకోండి: కారత్కు జగన్ విజ్ఞప్తి - Sakshi

బిల్లును అడ్డుకోండి: కారత్కు జగన్ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్కు విజ్ఞప్తి చేశారు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్కు  విజ్ఞప్తి చేశారు. పార్టీకి చెందిన నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి, ఇతర నాయకులతో కలసి ఆయన ఈ రోజు కారత్ను కలిశారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్నట్లు వివరించారు.  సమైక్య రాష్ట్ర పరిరక్షణకు సహకరించాలని వారు కారత్ను కోరారు.

రాష్ట్ర సమైక్యత కోసం గతంలో కూడా జగన్మోహన రెడ్డి బృందం జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలిసింది. రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టనుండటంతో జగన్ మళ్లీ జాతీయ నాయకులను కలిసి అభ్యర్థిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement