- రెండు రోజులు పొడిగించాలని బీఏసీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను రెండ్రోజులు పొడిగించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. తొలి బీఏసీలో 29 వరకు మాత్రమే సభ కొనసాగుతుందని నిర్ణయించగా ఆదివారం స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాజా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలో కరువు పరిస్థితులు, విద్యా విధానంపై 30న సభ స్వల్పకాలిక చర్చ చేపట్టనుంది. హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడిపైనా చ ర్చించే అవకాశం ఉంది. 31న సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర జల విధానంపై ప్రత్యేక చర్చ ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, జల విధానంపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అంశంపై బీఏసీలో భిన్నాభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం.
ప్రజెంటేషన్ ఇచ్చేట్లయితే అభ్యంతరాలు తెలిపేందుకు లేదా వాదనలు వినిపించేందుకు తామూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టగా మిగిలిన పార్టీలూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం ఏం మాట్లాడతారో ముందుగా తమకు నివేదిక ఇవ్వాలని, తమ పార్టీలోనూ ఇరిగేషన్ నిపుణు లున్నారని, వారి తో చర్చించి చర్చల్లో పాల్గొంటామని టీడీపీ కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్, ఇతర పక్షాలు సైతం అప్పటికప్పుడు తయారై చర్చలో పాల్గొనడం ఎలా కుదురుతుందని ప్రశ్నించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు నిబంధనలు అడ్డంకి గా ఉన్నందున మొదట అసెంబ్లీ కమిటీ హాలు లో ప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత అసెంబ్లీలో ప్రకటన చేయాలన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
దీంతో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై స్పష్టత లేకుండానే బీఏసీ సమావేశం ముగిసింది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని స్పీకర్‌కు బీఏసీ వదిలిపెట్టింది. 29వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుతోపాటు మరో నాలుగు బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపుద లకు సంబంధించిన బిల్లుతోపాటు, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ల అమలు, రాజీవ్ గాంధీ టెక్నాలజీ యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సవరణల బిల్లులను కూడా ప్రవేశపెడతారు.
31 వరకు అసెంబ్లీ
Published Mon, Mar 28 2016 2:27 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
Advertisement
Advertisement