టెట్ దరఖాస్తుల్లో మార్పులకు ఈనెల 30 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు టెట్ డెరైక్టర్ జగన్నాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: టెట్ దరఖాస్తుల్లో మార్పులకు ఈనెల 30 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు టెట్ డెరైక్టర్ జగన్నాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పేపరు, లాంగ్వేజి, సబ్జెక్టు, ఫొటో తదితర వివరాల్లో పొరపాట్లు ఉంటే ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలోని టెట్ విభాగంలో సంప్రదించి సవరించుకోవాలని సూచించారు. తొలుత 29వ తేదీ వరకే ఈ అవకాశం ఇచ్చినా 30 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.