SBI Amrit Kalash: భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన 'ఎస్‌బీఐ' (SBI) గత కొన్ని నెలలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి సంబంధించిన స్కీమ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం 2023 జూన్ 30 నాటికి ముగిసింది. అయితే డిపాజిట్ల స్వీకరణకు గడువు మళ్ళీ ఇప్పుడు పొడిగించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అమృత్ కలశ్ (Amrit Kalash) అనే పేరుగల ఈ స్కీమ్ గడువు ఇప్పటికే ముగిసింది. కానీ ఇప్పుడు SBI దీని గడువుని 2023 ఆగష్టు 15కి పెంచింది. అంటే ఈ స్కీమ్ ఇక కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఒకరకమైన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. దీని ద్వారా మంచి వడ్డీ పొందవచ్చు. తక్కువ కాలంలో మంచి వడ్డీ కావాలనుకునే వారికి ఇది మంచి స్కీమ్ అనే చెప్పాలి.
అమృత్ కలశ్ స్కీమ్ వడ్డీ..
నిజానికి అమృత్ కలశ్ స్కీమ్ కాల వ్యవధి కేవలం 400 రోజులు మాత్రమే. ఇందులో పెట్టుబడి పెట్టిన తరువాత సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. కాగా ఎస్‌బీఐ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక శాతం వడ్డీ ఎక్కువగా లభిస్తుంది.
(ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!)
అమృత్ కలశ్ స్కీమ్ కింద ఒక సీనియర్ సిటిజన్ రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే.. అతనికి 400 రోజులకు 7.6 శాతం వడ్డీ ప్రకారం రూ. 86,000 వడ్డీ, సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ లెక్కన రూ. 80,170 వడ్డీ లభిస్తుంది.
(ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం.. ఇలాగే జరిగితే చైనా కంపెనీల కథ కంచికే!)
అమృత్ కలశ్ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కి వెళ్ళవచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment