మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి భారీ ఊరట | Aircel-Maxis case: Protection from arrest to Chidambaram, Karti extended till March 8 | Sakshi
Sakshi News home page

మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి భారీ ఊరట

Published Mon, Feb 18 2019 11:44 AM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

Aircel-Maxis case: Protection from arrest to Chidambaram, Karti extended till March 8 - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరంకు మరోసారి ఊరట లభించింది. ఈయనతోపాటు కుమారుడు కార్తీ చిదంబరాన్ని కూడా మార్చి 8 వరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులలో ప్రశ్నించడానికి మార్చి 5, 6, 7, 12 తేదీల్లో సీబీఐ కోర్టుముందు హాజరు కావాలని  కోరామని ఈడీ కోర్టుకు తెలిపింది. అనంతరం కోసును మార్చి12వ తేదీకి  కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసును వాయిదా వేయడాన్ని అక్కడే కోర్టులో ఉన్నచిదంబరం  వ్యతిరేకించారు. ఈడీ కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. 

కాగా 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌కు సంబంధించి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపిబి) ఆమోదం విషయంలో కార్తి చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement