
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరానికి సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్‌ఎక్స్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం ప్రత్యేక న్యాయస్ధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇదే కేసులో ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. చిదంబరంను ఈ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఈడీ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అంగీకరించింది. ముందస్తు బెయిల్‌ను ఓ హక్కుగా అందరికీ మంజూరు చేసే పరిస్థితి ఉండదని, ఆర్థిక నేరాలను భిన్నంగా చూడాల్సి ఉంటుందని, దర్యాప్తు తొలిదశలో ముందస్తు బెయిల్ జారీ చేస్తే దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment