న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. జులై 3 దాకా కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
కేసు తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. తన క్లైంట్‌కు జ్యుడీషియల్ కస్ఠడీ పొడిగించడాన్ని కేజ్రీవాల్ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కేజ్రీవాల్‌కు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్డడీ ముగియడంతో తీహార్ జైలు నుంచి ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
కేజ్రీవాల్‌తో పాటు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న వినోద్‌చౌహాన్ కస్టడీని కూడా కోర్టు జులై 3 దాకా పొడిగించింది. లిక్కర్ స్కామ్‌లో ప్రతి అంశం చివరకు కేజ్రీవాల్‌కే ముడిపడి ఉంటోందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు కోర్టు ముందు వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment