మహిళా సైనికాధికారుల కమిషన్‌ గడువు మరో నెల పెంపు | One Month Extension For Commission Of Women Military Officers | Sakshi
Sakshi News home page

మహిళా సైనికాధికారుల కమిషన్‌ గడువు మరో నెల పెంపు

Published Wed, Jul 8 2020 1:25 AM | Last Updated on Wed, Jul 8 2020 1:25 AM

One Month Extension For Commission Of Women Military Officers - Sakshi

న్యూఢిల్లీ: మహిళా సైనికాధికారులకు ప్రత్యేకంగా పర్మనెంట్‌ కమిషన్‌ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు తీర్పు మరో నెల రోజుల గడువునిచ్చింది. గత తీర్పులో ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో నిర్ణయం తుది దశలో ఉందనీ, కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే మిగిలి ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాల్లోని ప్రతి విషయాన్నీ తు.చ.తప్పకుండా పాటిస్తామని కేంద్రం పేర్కొంది. కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఈ తీర్పు అమలుకు 6 నెలల సమయం కావాలని కేంద్రం కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. లింగ వివక్షను నిర్మూలించేందుకు మహిళాసైనికాధికారులకు పర్మనెంట్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17న చరిత్రాత్మక తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 3 నెలల లోపు పర్మనెంట్‌ కమిషన్‌ ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement