
ఇంద్రాణి కస్టడీ పొడిగింపు
ముంబై: షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా జ్యుడిషియల్ కస్టడీని పొడగించారు. ఇంద్రాణితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్కు ఈ నెల 31 వరకు కస్టడీ పొడగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2012 ఏప్రిల్ నెలలో కన్న కూతురుని ఇంద్రాణి ముఖర్జీ దారుణంగా చంపేసి అనంతరం రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే.