సాక్షి, ముంబై: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కొత్త హోండా డియోను విడుదల చేసింది, భారత్ స్టేజ్ 6(బిఎస్ 6) ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిన కొత్త హోండా డియో స్కూటర్‌ను లాంచ్ చేసింది. కొత్త డిజైన్, కొత్తఫీచర్లతో లాంచ్ చేసిన దీని ప్రారంభ ధరను రూ. 59,990గా ఉంచింది. కొత్త హోండా డియోకు 6 సంవత్సరాల వారంటీ ( 3 సంవత్సరాల ప్రామాణిక వారంటీ 3 సంవత్సరాల అదనపు ఐచ్ఛిక వారంటీ కూడా) అందిస్తోంది. మొత్తం ఏడు కొత్త రంగులలో స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో లభ్యం మవుతోంది.
110 సీసీ ఇంజన్, మెరుగైన స్మార్ట్ పవర్ (ఇఎస్‌పి)తో నడిచే హోండా ఎకో టెక్నాలజీ (హెచ్‌ఇటి) తో పాటు, కొత్త డిజైన్‌ను, కొత్త ఫీచర్లను న్యూ వేరియంట్‌లో జోడించింది. దీని ఇంజీన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.68 బీహెచ్‌పీ పవర్‌ను, 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 8.79 ఎన్ఎమ్ గరిష్ట్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 2020 హోండా డియోలో కొత్త సిగ్నేచర్ ఎల్‌ఇడి పొజిషన్ లాంప్, మోడరన్ టెయిల్ లాంప్ డిజైన్, స్ప్లిట్ గ్రాబ్ రైల్స్, కాంబీ బ్రేక్ సిస్టం(సీబీఎస్) కొత్త బాడీ గ్రాఫిక్‌లతో కొత్త హోండా డియోకు పుల్ డిజిటల్ స్పీడోమీటర్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ప్రధాన ఫీచర్లు.
ధరలు
2020 హోండా డియో బిఎస్ 6 మోడల్ స్టాండర్డ్ వేరియంట్ ధర : 59,990 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్, కాండీ జాజీ బ్లూ, స్పోర్ట్స్ రెడ్ , వైబ్రెంట్ ఆరెంజ్ ఇలా నాలుగు రంగు ఎంపికలలో లభిస్తుంది.
హోండా డియో డీలక్స్ వేరియంట్ ధర రూ.63,340 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) మాట్టే సాంగ్రియా రెడ్ మెటాలిక్, డాజిల్ ఎల్లో మెటాలిక్ , మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్ అనే మూడు రంగు ఎంపికలలో లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment