DIO
-
పండక్కి వచ్చేస్తోంది... సరికొత్త రూపంలో హోండా యాక్టివా!
స్కూటర్ విభాగానికి యాక్టివా రూపంలో పవర్‌ని పరిచయం చేసిన హోండా సంస్థ పండక్కి కొత్త కబురు చెప్పేందుకు రెడీ అయ్యింది. సక్సెస్ ఫుల్ మోడల్ యాక్టివాతో పాటు డియో నుంచి కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు మార్కెట్లోకి తేబోతుంది. పండక్కి రిలీజ్ ఇటీవల హోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తమ కంపెనీ రాబోతున్న కొత్త మోడళ్లకు సంబంధించి డాక్యుమెంట్లను ఆర్టీఏ కార్యాలయం ఢిల్లీలో సమర్పించింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నట్టు పేర్కొంది. రాబోయే పండగ సీజన్లోనే ఈ కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎల్ఈడీ సొబగులు హోండా యాక్టివాకు సంబంధించి మార్కెట్లో ప్రస్తుతం 5జీ వెర్షన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగా తాజాగా 6జీ వెర్షన్‌ను తెచ్చేందుకు హోండా సిద్ధమైంది. హోండా 6జీ, హోండా 6జీ ఎల్ఈడీ వెర్షన్లలో రెండు స్కూటర్లు మార్కెట్లోకి రాబోతున్నట్టు హోండా డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం హోండా యాక్టివాకు స్టీల్ వీల్స్ ఉండగా 6జీ నుంచి ఎల్లాయ్ వీల్స్‌ని పరిచయం చేయనుంది. డియో నాలుగు వెర్షన్లలో యాక్టివాతో పాటు హోండా డియోకు సంబంధించి మొత్తం 4 వెర్షన్లను మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇందులో కాంపోజిట్కాస్ట్ వీల్స్, డిజిటల్ స్పీడోమీటర్, కాంపోసిట్కాస్ట్వీల్స్, 3డి ఎంబ్లెమ్ వేరియంట్లలో మార్కెట్లోకి తేబోతున్నట్టు తెలుస్తోంది. 110 సీసీ హోండా త్వరలో మార్కెట్లోకి తేబోతున్న 6జీ యాక్టివా, డియో మోడల్స్ రెండింటి ఇంజన్ సామర్థ్యం 109.51 సీసీ సింగిల్ సిలిండర్‌గా ఉంది. యాక్టివా 5జీ 7.68 హెచ్పీతో 8,000 ఆర్పీఎం శక్తిని విడుదల చేయనుంది. ఇక డియోకు సంబంధించి 7.65 హెచ్పీతో 8,000 ఆర్‌పీఎంని రిలీజ్ చేస్తుంది. చదవండి : పలు కార్లపై బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన హోండా..! -
హోండా డియో బీఎస్-6 లాంచ్
సాక్షి, ముంబై: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) కొత్త హోండా డియోను విడుదల చేసింది, భారత్ స్టేజ్ 6(బిఎస్ 6) ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిన కొత్త హోండా డియో స్కూటర్‌ను లాంచ్ చేసింది. కొత్త డిజైన్, కొత్తఫీచర్లతో లాంచ్ చేసిన దీని ప్రారంభ ధరను రూ. 59,990గా ఉంచింది. కొత్త హోండా డియోకు 6 సంవత్సరాల వారంటీ ( 3 సంవత్సరాల ప్రామాణిక వారంటీ 3 సంవత్సరాల అదనపు ఐచ్ఛిక వారంటీ కూడా) అందిస్తోంది. మొత్తం ఏడు కొత్త రంగులలో స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో లభ్యం మవుతోంది. 110 సీసీ ఇంజన్, మెరుగైన స్మార్ట్ పవర్ (ఇఎస్పి)తో నడిచే హోండా ఎకో టెక్నాలజీ (హెచ్ఇటి) తో పాటు, కొత్త డిజైన్‌ను, కొత్త ఫీచర్లను న్యూ వేరియంట్లో జోడించింది. దీని ఇంజీన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.68 బీహెచ్పీ పవర్‌ను, 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 8.79 ఎన్ఎమ్ గరిష్ట్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 2020 హోండా డియోలో కొత్త సిగ్నేచర్ ఎల్ఇడి పొజిషన్ లాంప్, మోడరన్ టెయిల్ లాంప్ డిజైన్, స్ప్లిట్ గ్రాబ్ రైల్స్, కాంబీ బ్రేక్ సిస్టం(సీబీఎస్) కొత్త బాడీ గ్రాఫిక్‌లతో కొత్త హోండా డియోకు పుల్ డిజిటల్ స్పీడోమీటర్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ప్రధాన ఫీచర్లు. ధరలు 2020 హోండా డియో బిఎస్ 6 మోడల్ స్టాండర్డ్ వేరియంట్ ధర : 59,990 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్, కాండీ జాజీ బ్లూ, స్పోర్ట్స్ రెడ్ , వైబ్రెంట్ ఆరెంజ్ ఇలా నాలుగు రంగు ఎంపికలలో లభిస్తుంది. హోండా డియో డీలక్స్ వేరియంట్ ధర రూ.63,340 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) మాట్టే సాంగ్రియా రెడ్ మెటాలిక్, డాజిల్ ఎల్లో మెటాలిక్ , మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్ అనే మూడు రంగు ఎంపికలలో లభిస్తుంది. -
31 జిల్లాలకు డీఐఓల నియామకం
- అర్థరాత్రి దాటాక నీటి పారుదల శాఖ ఉత్తర్వులు హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన నేపధ్యంలో 31 జిల్లాలకు జిల్లా ఇరిగేషన్ అధికారులు(డీఐఓ)లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం వేకువజామున ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ఇకపై జిల్లా ఇరిగేషన్ అధికారులుగా ప్రభుత్వం హోదా కల్పించింది. ఆదిలాబాద్‌కు ఇ.ఇ. డి.సుశీల్ కుమార్, నిర్మల్‌కు బి.వి.రమణారెడ్డి, మంచిర్యాలకు ఎం.వేణుగోపాలరావు, కొమురంభీం ఆసిఫాబాద్‌కు జె.గుణవంత్ రావు, కరీంనగర్‌కు టి. శ్రీనివాసరావు గుప్తా, జగిత్యాలకు సిహెచ్.బుచ్చిరెడ్డి , పెద్దపల్లికి ఎల్.సత్యవర్దన్, సిరిసిల్లకు బి.చిరంజీవులు, వరంగల్‌కు ఎ.శ్రీనివాస రెడ్డి, మహబూబాబాద్‌కు ఎల్.వై. రత్నం, జనగామకు ఎం.రామ్‌ప్రసాద్, జయశంకర్ భూపాలపల్లికి కె.రవీందర్, ఖమ్మంకు సిహెచ్. చిట్టిరావు, భద్రాద్రి కొత్తగూడెంకు కె.వెంకటేశ్వరరెడ్డి, నిజామాబాద్‌కు పి.రాధాకిషన్‌రావు, కామారెడ్డికి కె.మధుకర్ రెడ్డి, మెదక్‌కు బి.యేసయ్య, సిద్ధిపేటకు డి.రవీందర్ రెడ్డి, సంగారెడ్డికి పి.రాములు, వికారాబాద్ కు టి.వెంకటేశం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌కు ఎస్. భీమ్ ప్రసాద్, మహబూబ్‌నగర్‌కు డి.నరసింగరావు, నాగర్ కర్నూలుకు బి.గోవిందు, వనపర్తికి ఎస్.శ్రీనివాసులు, గద్వాలకు కె. శ్రవణ్ కుమార్, నల్లగొండకు హమీద్ ఖాన్, సూర్యాపేటకు ఎన్.సంజీవరెడ్డి, యాదాద్రి జిల్లాకు ఇరిగేషన్ అధికారిగా సుధీర్‌ను నియమించారు. -
వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి జాఢ్యం
కాకినాడ క్రైం : వైద్య,ఆరోగ్య శాఖలో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు నియామకాలు జరుగుతున్నాయని ఆ శాఖ సిబ్బందే గగ్గోలు పెడుతున్నారు. ఉన్నతస్థాయిలో అవినీతి వల్ల సీనియర్లకు సైతం అన్యాయం జరుగుతోందంటున్నారు. తాజాగా జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) పోస్టు భర్తీయే అందుకు సాక్ష్యమంటున్నారు. గతంలో పిఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్న వైద్యురాలిని రెండేళ్ల ఫారిన్ సర్వీసెస్ కాంట్రాక్టులో జవహర్ బాల ఆరోగ్య రక్ష (జెబార్) జిల్లా కో-ఆర్డినేటర్‌గా నియమించారు. పట్టుమని పది నెలలు కాకుండానే ఆమెను డీఐఓ పోస్టులో నియమించారు. ఈ విషయంలో రాష్ట్ర స్థాయి అధికారులు సైతం నిబంధనలను తుంగలో తొక్కారని వైద్య సిబ్బంది విమర్శిస్తున్నారు. గగ్గోలుపెడుతున్న సీనియర్లు డీఐఓ డాక్టర్ బి.మురళీకృష్ణ గొంతు సంబంధిత రుగ్మతతో బాధపడుతుండడంతో ఆయనను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఆయన స్థానంలోకి రావాలని ముమ్మిడివరం ఎస్పీహెచ్ఓ డాక్టర్ కేశవ ప్రసాద్, కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న ఎస్పీహెచ్ఓ డాక్టర్ ఆర్.రాజేశ్వరి, పెదపూడి ఎస్పీహెచ్ఓ డాక్టర్ వి.వెంకట్రావు ప్రయత్నించారు. పలువురు సీనియర్లున్నా రాత్రికి రాత్రే జెబార్ కో-ఆర్డినేటర్‌ను నియమించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ఆమె నియామకంపై జీఓ కూడా విడుదల కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. అంతేకాక బదిలీలపై నిషేధం ఎత్తివేశాక కౌన్సెలింగ్ నిర్వహించి డీఐఓ పోస్టు భర్తీ చేయాల్సి ఉండగా భారీగా ముడుపులు అందుకున్నందునే ఉన్నతాధికారులు అడ్డగోలు నియామకాలకు తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏఓ స్థానం కోసమేనా? వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ పరిపాలనాధికారి (ఏఓ) పోస్టు ఏడాది నుంచి ఖాళీగా ఉండడంతో ఇటీవల జెబార్ కో-ఆర్డినేటర్‌ను ఇన్చార్జ్ ఏఓగా నియమిస్తూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. పవన్ కుమార్ ఆదేశాలిచ్చారు. ఏఓగా పనిచేసేందుకు కార్యాలయంలో నలుగురు ఉద్యోగులకు అర్హతలున్నా ఆ వైద్యురాలికే ఇన్చార్జ్ ఏఓ స్థానం అప్పగించడం వెనుక మర్మమేమిటని కార్యాలయ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఏఓ స్థానాన్ని ఆమెకు పూర్తిస్థాయిలో అప్పగించేందుకే డీఐఓ పోస్టు కట్టబెట్టారంటున్నా. ప్రస్తుతం ఆ వైద్యురాలు జెబార్ కో-ఆర్డినేటర్‌గా, డీఐఓగా, ఏఓగా విధులు నిర్వహిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్‌ఆర్‌టీసీ వైద్యాధికారి పదవికీ గండం.. ఫైలేరియా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఎఫ్‌ఆర్‌టీసీ) వైద్యాధికారి పదవికి కూడా గండం పొంచి ఉంది. పిఠాపురం పీహెచ్సీలో పనిచేస్తున్న ఓ వైద్యాధికారికి ఆ పోస్టును అడ్డదారిలో అప్పగించేందుకు భారీగా ముడుపులు దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.