జిల్లాల పునర్విభజన నేపధ్యంలో 31 జిల్లాలకు జిల్లా ఇరిగేషన్ అధికారులు(డీఐఓ)లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం వేకువజామున ఉత్తర్వులు జారీ చేసింది.
- అర్థరాత్రి దాటాక నీటి పారుదల శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన నేపధ్యంలో 31 జిల్లాలకు జిల్లా ఇరిగేషన్ అధికారులు(డీఐఓ)లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం వేకువజామున ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ఇకపై జిల్లా ఇరిగేషన్ అధికారులుగా ప్రభుత్వం హోదా కల్పించింది. ఆదిలాబాద్కు ఇ.ఇ. డి.సుశీల్ కుమార్, నిర్మల్కు బి.వి.రమణారెడ్డి, మంచిర్యాలకు ఎం.వేణుగోపాలరావు, కొమురంభీం ఆసిఫాబాద్కు జె.గుణవంత్ రావు, కరీంనగర్కు టి. శ్రీనివాసరావు గుప్తా, జగిత్యాలకు సిహెచ్.బుచ్చిరెడ్డి , పెద్దపల్లికి ఎల్.సత్యవర్దన్, సిరిసిల్లకు బి.చిరంజీవులు, వరంగల్కు ఎ.శ్రీనివాస రెడ్డి, మహబూబాబాద్కు ఎల్.వై. రత్నం, జనగామకు ఎం.రామ్‌ప్రసాద్, జయశంకర్ భూపాలపల్లికి కె.రవీందర్, ఖమ్మంకు సిహెచ్. చిట్టిరావు, భద్రాద్రి కొత్తగూడెంకు కె.వెంకటేశ్వరరెడ్డి, నిజామాబాద్కు పి.రాధాకిషన్‌రావు, కామారెడ్డికి కె.మధుకర్ రెడ్డి, మెదక్కు బి.యేసయ్య, సిద్ధిపేటకు డి.రవీందర్ రెడ్డి, సంగారెడ్డికి పి.రాములు, వికారాబాద్ కు టి.వెంకటేశం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌కు ఎస్. భీమ్ ప్రసాద్, మహబూబ్‌నగర్‌కు డి.నరసింగరావు, నాగర్ కర్నూలుకు బి.గోవిందు, వనపర్తికి ఎస్.శ్రీనివాసులు, గద్వాలకు కె. శ్రవణ్ కుమార్, నల్లగొండకు హమీద్ ఖాన్, సూర్యాపేటకు ఎన్.సంజీవరెడ్డి, యాదాద్రి జిల్లాకు ఇరిగేషన్ అధికారిగా సుధీర్ను నియమించారు.