వైఎస్సార్‌సీపీలో పలు జిల్లాల అధ్యక్షుల నియామకం | Appointments Of Many District And City President In YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో పలు జిల్లాల అధ్యక్షుల నియామకం

Published Tue, Sep 3 2024 8:00 PM | Last Updated on Tue, Sep 3 2024 8:16 PM

Appointments Of Many District And City President In YSRCP

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు జిల్లా, నగర అధ్యక్షుల నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షులుగా అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీ చరణ్, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షులుగా మార్గాని భరత్ రామ్‌ నియమితులయ్యారు.

కాగా, మంగళవారం.. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలు, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ నాయకులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  భేటీ అయ్యారు. వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. పార్టీ నాయకుల సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement