ఘనంగా శ్రీకృష్ణజన్మాష్టమి | Sri Krishna's Janmashtami celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా శ్రీకృష్ణజన్మాష్టమి

Published Sun, Aug 17 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

ఘనంగా శ్రీకృష్ణజన్మాష్టమి

ఘనంగా శ్రీకృష్ణజన్మాష్టమి

సాక్షి, ముంబై : ఉట్టి ఉత్సవాలకు ముంైబైతోపాటు దాదాపు అన్ని ప్రాంతాలు ముస్తాబయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి శ్రీకష్ణుని జన్మదినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి ఉట్టి ఉత్సవాలు ఇదే స్ఫూర్తితో నిర్వహించడానికి ఉట్టికొట్టేమండళ్లన్నీ ఏర్పాట్లు చేసుకొన్నాయి. ఈ సారి మానవపిరమిడ్ల విషయంపై కోర్టులో వ్యాజ్యం దాఖలుచేయడంతో ఉట్టి ఉత్సవాలపై అనేక అనుమానాలు తలెత్తాయి. సుప్రీం కోర్టులో కొంత ఊరట లభించడంతో ఉట్టి కొట్టే మండళ్లతోపాటు ఉట్టి నిర్వాహకుల్లో ఆనందం కన్పిస్తోంది.

ఉత్సవాలను సంప్రదాయంగా నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకొన్నారు. దాదర్‌లోని మార్కెట్లు రద్దీగా మారాయి. మానవ పిరమిడ్లు ఏర్పాటు చేసి ఉట్టి పగుల కొట్టే సమయంలో ప్రమాదాలకు గురయ్యే గోవిందలను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీ ఎంసీ) ఆదుకోనుంది. ముంబై, ఠాణేలో పెద్దఎత్తున ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తారు.ఉత్సవాలను తిలకించడానికి చిన్నపెద్ద, ఆడ మగా తరలివస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement