అయోధ్యలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు | Janmashtami will be Celebrated in Ram Temple | Sakshi
Sakshi News home page

అయోధ్యలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Aug 26 2024 11:52 AM | Updated on Aug 26 2024 11:52 AM

Janmashtami will be Celebrated in Ram Temple

యూపీలోని అయోధ్యలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు  శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్  సకల ఏర్పాట్లు చేసింది. ఈ  ఏడాదే ప్రారంభమైన ఈ ఆలయంలో తొలిసారిగా రామనవమి జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా జరుగుతోంది.

ట్రస్టు సభ్యులు డా అనిల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈరోజున బాలరామునికి ఒకటిన్నర క్వింటాళ్ల నైవేద్యాన్ని సమర్పించనున్నామని తెలిపారు. నేడు రోజుంతా భజన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జన్మాష్టమి  సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ నిర్వహించామన్నారు. సాయంత్రం భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement