వెన్న దొంగకు ఇష్టమైన.. గోపాల్‌కాలా ఎలా చేయాలంటే.. | Krishna Janmashtami 2023: Special Recipe Gopalkala Or Dahi Kala | Sakshi
Sakshi News home page

Gopalkala Or Dahi Kala: వెన్న దొంగకు ఇష్టమైన.. గోపాల్‌కాలా ఎలా చేయాలంటే..

Published Thu, Sep 7 2023 11:35 AM | Last Updated on Thu, Sep 7 2023 1:07 PM

Krishna Janmashtami 2023: Special Recipe Gopalkala Or Dahi Kala  - Sakshi

కృష్ణుడు వెన్న దొంగ ఎందుకయ్యాడు ?..అంటే వెన్న... రుచి  మాములుగా ఉండదు. అది అందర్నీ దొంగల్ని చేస్తుంది. దీంతో చేసే స్వీట్లు అన్ని ఇన్నీ కావు. వాటి రుచే వేరు. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా ఆ చిన్న కృష్ణుడి కోసం పాలు... పెరుగు... వెన్న... మీగడలు సిద్ధం చేసుకోండి. పాత్ర పెట్టండి...స్టవ్‌ వెలిగించండి. వండే లోపు వెన్న మాయవుతుందేమో! జర జాగ్రత్త! ఆ చిన్ని గోపాలుడి కంటపడకుండా..ఆయన ఇష్టంగా ఆరగించే గోపాల్‌కాలాని పెరుగుతో ఇలా చకచక చేసేయండి.

గోపాల్‌కాలాకి కావలసినవి:
అటుకులు – కప్పు
 పెరుగు – అర కప్పు 
కీర ముక్కలు – కప్పు
తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్‌ స్పూన్‌లు
అల్లం తురుము – టీ స్పూన్‌  
పచ్చి మిర్చి – 1 (తరగాలి)
తరిగిన కొత్తిమీర – అర కప్పు 
దానిమ్మ గింజలు – టేబుల్‌ స్పూన్‌  
కిస్‌మిస్‌ – టేబుల్‌ స్పూన్‌ 
ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి.
పోపు కోసం: వెన్న – టేబుల్‌ స్పూన్‌ 
ఆవాలు – అర టీ స్పూన్‌  
జీలకర్ర – అర టీ స్పూన్‌  
కరివేపాకు – 2 రెమ్మలు, పచ్చి మిర్చి – 1 (తరగాలి), ఇంగువ – చిటికెడు (టీ స్పూన్‌ లో ఎనిమిదో వంతు)

తయారీ విధానం: అటుకులను నీటిలో వేసి కడిగి వెంటనే తీసి మరొక పాత్రలో వేసుకోవాలి. అందులో అడుగున చేరిన నీటిని కూడా పూర్తిగా వంపేయాలి. ∙శుభ్రం చేసిన అటుకులు, కీర ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం తరుగు, దానిమ్మ గింజలు, కిస్‌మిస్, కొత్తిమీర అన్నింటినీ పెద్ద పాత్రలో వేసి గరిటతో కలపాలి. అందులో పెరుగు, ఉప్పు వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.∙పెనంలో వెన్న వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి కలిపి దించేయాలి. ఈ పోపును అటుకుల మిశ్రమంలో వేసి కలిపితే గోపాల్‌కాలా రెడీ.

(చదవండి: పన్నీర్‌ పాడవ్వకుండా ఉండాలంటే..ఇలా చేయండి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement