Gopal Krishna
-
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదుపేదింటి నుంచి అమెరికాకు వెళ్లాను..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచ్చినా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృçష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్‌లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్‌గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జమ్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్‌తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్‌కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్‌కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్‌కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్‌గా.. అమెరికాలోని అయోవా స్టేట్‌లో రిపబ్లికన్ పార్టీకి మూడు సార్లు చైర్మన్‌గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్‌గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
వెన్న దొంగకు ఇష్టమైన.. గోపాల్‌కాలా ఎలా చేయాలంటే..
కృష్ణుడు వెన్న దొంగ ఎందుకయ్యాడు ?..అంటే వెన్న... రుచి మాములుగా ఉండదు. అది అందర్నీ దొంగల్ని చేస్తుంది. దీంతో చేసే స్వీట్లు అన్ని ఇన్నీ కావు. వాటి రుచే వేరు. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా ఆ చిన్న కృష్ణుడి కోసం పాలు... పెరుగు... వెన్న... మీగడలు సిద్ధం చేసుకోండి. పాత్ర పెట్టండి...స్టవ్ వెలిగించండి. వండే లోపు వెన్న మాయవుతుందేమో! జర జాగ్రత్త! ఆ చిన్ని గోపాలుడి కంటపడకుండా..ఆయన ఇష్టంగా ఆరగించే గోపాల్కాలాని పెరుగుతో ఇలా చకచక చేసేయండి. గోపాల్కాలాకి కావలసినవి: అటుకులు – కప్పు పెరుగు – అర కప్పు కీర ముక్కలు – కప్పు తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు అల్లం తురుము – టీ స్పూన్ పచ్చి మిర్చి – 1 (తరగాలి) తరిగిన కొత్తిమీర – అర కప్పు దానిమ్మ గింజలు – టేబుల్ స్పూన్ కిస్మిస్ – టేబుల్ స్పూన్ ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. పోపు కోసం: వెన్న – టేబుల్ స్పూన్ ఆవాలు – అర టీ స్పూన్ జీలకర్ర – అర టీ స్పూన్ కరివేపాకు – 2 రెమ్మలు, పచ్చి మిర్చి – 1 (తరగాలి), ఇంగువ – చిటికెడు (టీ స్పూన్ లో ఎనిమిదో వంతు) తయారీ విధానం: అటుకులను నీటిలో వేసి కడిగి వెంటనే తీసి మరొక పాత్రలో వేసుకోవాలి. అందులో అడుగున చేరిన నీటిని కూడా పూర్తిగా వంపేయాలి. ∙శుభ్రం చేసిన అటుకులు, కీర ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం తరుగు, దానిమ్మ గింజలు, కిస్మిస్, కొత్తిమీర అన్నింటినీ పెద్ద పాత్రలో వేసి గరిటతో కలపాలి. అందులో పెరుగు, ఉప్పు వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.∙పెనంలో వెన్న వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి కలిపి దించేయాలి. ఈ పోపును అటుకుల మిశ్రమంలో వేసి కలిపితే గోపాల్‌కాలా రెడీ. (చదవండి: పన్నీర్ పాడవ్వకుండా ఉండాలంటే..ఇలా చేయండి!) -
మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం
భువనేశ్వర్: మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం శుక్రవారం చోటుచేసుకుంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఒడిశా క్రైమ్ బ్రాంచ్ 540 పేజీలకు పైగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ విషాద ఘటనలో ప్రధాన నిందితుడు గోపాల్ కృష్ణ దాస్ (53) వ్యతిరేకంగా ఆయుధాల చట్టం ప్రకారం 307, 302, 27 (1) సెక్షన్లు కింద అభియోగాలు నమోదు చేశారు. పాత వైరం కారణంగా నిందితుడు దారుణ హత్యకు పాల్పడినట్లు విచారణలో ధ్రువీకరించినట్లు చార్జ్‌షీటులో వెల్లడించారు. జనవరి 29న హత్య ఈ ఏడాది జనవరి 29న మంత్రి అధికారిక కార్యక్రమం పర్యటనలో నడి రోడ్డమీద జన సందోహం మధ్య నిందితుడు తుపాకీ గురిపెట్టి పేల్చడంతో మంత్రి అక్కడిక్కడే కుప్పకూలిపోయిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, శాసీ్త్రయ బృందం పరిశీలన నివేదికల ఆధారంగా నిందిత ఏఎస్ఐ గోపాల కృష్ణ దాస్‌ని విధుల నుంచి బహిష్కరించారు. మంత్రితో బ్రజ్‌రాజ్‌నగర్ ఠాణా ఇన్చార్జి ఇన్స్పెక్టర్ (ఐఐసీ) పి.కె.స్వంయి మరో సిబ్బంది జీవన్ కుమార్ నాయక్‌ని హత్య చేసేందుకు నిందితుడు విఫలయత్నం చేసినట్లు ఝార్సుగుడ ఎస్డీజేఎం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ మీడియాకు తెలియజేసింది. ముందస్తు ప్రణాళికతోనే... నిందితుడు ఏఎస్ఐ గోపాల్‌కృష్ణ దాస్ తెలివిగా ముందస్తు ప్రణాళికతో ఈ నేరానికి పాల్పడ్డాడని క్రైం బ్రాంచ్ తెలిపింది. అతని మానసిక పరిస్థితి స్థిరంగా, సాధారణమైనదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎటువంటి మానసిక అనారోగ్య లక్షణాలు దర్యాప్తులో బయటపడనట్లు వివరించింది. సంచలనాత్మక హత్య సంఘటనకు సంబంధించిన అన్ని రకాల సాక్ష్యాలను పరిశీలించి విశ్లేషించింది. ఈ నేపథ్యంలో మౌఖిక, దస్తావేజులు, మెడికో–లీగల్, సైబర్ ఫోరెన్సిక్ మరియు బాలిస్టిక్ నివేదికలను క్రైం శాఖ లోతుగా సమీక్షించింది. ఈ సమీక్షలో నిందితుడు గోపాల్ కృష్ణ దాస్ దివంగత మంత్రి నవ కిషోర్ దాస్ మరియు అతని అనుచరులతో తనకు ప్రాణాపాయం ఉన్నట్లు భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంత్రి అనుచర వర్గాలు తరచు ఆయనకు ప్రాణాపాయ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో మంత్రిపై వ్యక్తిగత ద్వేషం బలపడి మానసిక వేదనతో మంత్రిని నిలువునా హత్య చేసి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో స్పష్టమైంది. అభద్రతా భావంతోనే మంత్రి హత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. దీనికోసం పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకుని బెడిసి కొట్టని వ్యూహంతో తుపాకీ గురి పెట్టి ఘటనా స్థలంలో మంత్రిని కుప్పకూల్చినట్లు క్రైం శాఖ తెలిపింది. ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ, కొన్ని నివేదికలు, వివరణలను పొందడం కోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. మానసిక రోగి: కుటుంబ సభ్యులు నిందితుడి కుటుంబ సభ్యులు గోపాల్ కృష్ణదాస్ చాలాకాలంగా మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కొంతకాలంగా బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని అంటున్నారు. అయితే అనుబంధ చికిత్స కొనసాగుతుందని దర్యాప్తు వర్గాలు విచారణలో పేర్కొన్నాయి. మానసిక ఇబ్బందుల విషయం ధ్రువీకరించేందుకు వైద్య విద్య మరియు శిక్షణ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు అనుబంధ పరీక్షలను నిర్వహించి, నిందితుడిలో మానసిక అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు లేవని స్పష్టం చేసింది. స్థానికులు, సహోద్యోగుల వాంగ్మూలం వైద్య బోర్డు అభిప్రాయానికి చేరువగా ఉన్నట్లు క్రైమ్ శాఖ తెలిపింది. నిందితుడు సాదాసీదాగా కలిసిమెలిసి తిరుగాడే వ్యక్తిగా తోటి వ్యక్తుల వాంగ్మూలం దర్యాప్తు బృందం నమోదు చేసింది. ఇలా పరిసరాల పరిశీలన, అనుబంధ విశ్లేషణలో నిందితుని మానసిక పరిస్థితి చాలా సాధారణంగా ఉందని, ఎటువంటి అసాధారణత లేదని నిర్ధారించారు. విచారణకు నిందితుడు సంతృప్తికరంగా సహకరించారని, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. అధికారిక రివాల్వరే హత్యాస్త్రం విధి నిర్వహణలో ఉండగా పోలీసు ఏఎస్ఐ గోపాల్ కృష్ణ దాస్ హత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తన దగ్గర ఉన్న అధికారిక రివాల్వర్‌తో సిటింగు ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నవ కిషోర్ దాస్‌ను జన సందోహం మధ్య కాల్చి నడిరోడ్డు మీద కుప్పకూల్చేశాడు. ఈ హత్య వెనుక కుట్ర ఉందని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు నిలువెత్తున ఆరోపించాయి. విచారణ చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసిన క్రైమ్ బ్రాంచ్ విచారణలో కుట్ర కోణం జాడ లేనట్లు వెల్లడించింది. 10 బృందాలతో దర్యాప్తు సిటింగ్ మంత్రి హత్య జరిగిన రోజు నుంచే క్రైమ్ బ్రాంచ్, బ్రజరాజ్‌నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోతైన దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్ 10 బృందాలను ఏర్పాటు చేసింది. హత్య వ్యూహం పూర్వాపరాలను ఆరా తీసేందుకు రాష్ట్రంలో ఝార్సుగుడ, భువనేశ్వర్, బరంపురం మరియు పలు ఇతర రాష్ట్రేతర ప్రాంతాలు సందర్శించి దర్యాప్తు బృందాలు పూర్వాపరాలు ఆరా తీశాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు వర్గాలు 89 మంది సాక్షులను ప్రశ్నించారు. తుపాకీలు, లైవ్ కాట్రిడ్జ్‌లు, ఖాళీ కాట్రిడ్జ్‌లు ఇతరేతర పలు రుజువుపూరిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ జరిగింది ఝార్సుగూడ జిల్లాలో మంత్రి కార్యక్రమం పురస్కరించుకుని నిందిత ఏఎస్ఐ గోపాల్ కృష్ణదాస్‌ని ట్రాఫిక్ క్లియరెన్స్ డ్యూటీ కోసం నియమించారు. ఈ అవకాశాన్ని వ్యూహాత్మకంగా మలచుకుని తన దగ్గర ఉన్న 9 ఎంఎం సర్వీస్ పిస్టల్ని ఉపయోగించి అతి సమీపం నుంచి మంత్రిపై కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో కూరుకుపోయిన మంత్రిని హెలికాప్టర్లో హుటాహుటిన భువనేశ్వర్‌కు తరలించారు. అయితే అంతర్గత రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ మంత్రి తుదిశ్వాస విడిచాడు. నిందితుడు 2013లో ఝార్సుగుడ జిల్లాలో పోలీసు ఉద్యోగం పొందాడు. తన ఉద్యోగ జీవితంలో నిందిత గోపాల కృష్ణ దాస్ శ్రేష్టమైన పనితీరుకు తొమ్మిది రివార్డులు, 18 ప్రశంసా పత్రాలు పొందడం విశేషం. అతని కుటుంబం బరంపురం శివారులోని జలేశ్వరఖండిలో ఉంటుంది. విచారణలో భాగంగా నిందితుడికి మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రేతర (బెంగుళూరు) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్‌కు తీసుకెళ్లాలన్న అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించింది. -
బాల్రాజా మజాకా!
ప్లీడర్ బాల్‌రాజు దగ్గరికి పెద్దగా క్లయింట్లు రారు. ఆ వచ్చినవాడు కూడా రూపాయి చేతిలో పెట్టి ‘‘ఎలాగైనా సరే కేసు గెలిపించాలి. నీదే పూచీ’’ అంటాడు. ఇలాంటి బాల్రాజుకి గట్టి కేస్ ఒకటి తగిలితే! కమ్మని సంగీతం, కడుపుబ్బా నవ్వించే హాస్యం విందు చేసే సినిమాలోని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘ఇదేనా ప్లీడర్ ఇల్లు?’’ అని ప్రశ్నించి ‘‘ఇదే అయ్యుంటుందిలే’’ అని సమాధానం చెప్పుకున్నాడు రాకరాక వచ్చిన క్లయింటు.ఇంట్లో నుంచి ఒక వ్యక్తి నల్లకోటుతో బయటకు వచ్చాడు. క్లయింట్గారి సందేహానికి నల్లకోటే సమాధానం చెబుతుంది. అయినా సరే...‘‘ఏయ్... ప్లీడర్ బాల్‌రాజు ఇల్లు ఇదేనా?’’ అని సాక్షాత్తు ప్లీడర్నే పట్టుకొని అడిగాడు క్లయింటు.ప్లీడర్‌గారు లైట్‌గా నొచ్చుకొని...‘ఏందయ్యా మంచీమర్యాద లేకుండా. కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా’’ అన్నారు.ఇప్పటికైనా క్లయింటు ఊరుకున్నాడా? ఎక్కడ ఊరుకుంటాడు. మళ్లీ అలాగే అడిగాడు...‘‘ప్లీడర్ బాల్‌రాజు ఇల్లుఇదేనా?’’‘‘నేనేనయ్యా బాల్రాజును. కావాలంటే చూడు ఒక కేసు స్టడీ చేస్తున్నాను’’ అని క్లయింట్‌ను నమ్మించడానికి కళ్లలోని భావాల సహాయ సహకారాలతో తెగ ప్రయత్నించాడు ప్లీడరు.అయినా సరే...‘‘నాకు డౌటే బావా!’’ అన్నారు క్లయింట్గారి బామ్మర్దిగారు.ఇలా కొంచెంసేపయ్యాక... అతడు ప్లీడరేనని, అతని పేరు బాల్రాజేనని, అతడి ఇల్లు ఇదేనని క్లయింట్గారు బలహీనంగా నమ్మారు. తాను ఎందుకొచ్చింది ఇలా చెప్పారు...‘‘ఇంతకీ కేసేమిటంటే, నాకో అరటితోట ఉంది. అందులో రోజూ ఒకడు అరటిగెల మాయం చేస్తున్నాడు. ఆడ్ని చితగ్గొట్టాను...’’‘‘ఓస్ అంతేగా... ముందు ఫీజు ఇవ్వు’’ క్లయింట్‌కు ధైర్యం చెప్పాడు బాల్‌రాజు.క్లయింట్గారు చాలా జాగ్రత్తగా రూపాయి బిళ్లను ప్లీడర్ చేతిలో పెట్టాడు. ప్లీడర్‌గారు నవ్వలేడు. ఏడ్వలేడు. అలా అని మౌనంగానూ ఉండలేడు.... అయ్యో! అంతమాత్రాన మీరు అతడిని చెవిలో దూదిలా తేలిగ్గా తీసిపారేయకండి... ఈ సీన్లలో చూడండి ఎలా విజృంభిస్తున్నాడో... ‘‘యువరానర్ ఇది గోపాలకృష్ణ–సుజాత మ్యారేజి సర్టిఫికెట్. వాళ్లిద్దరికీ పెళ్లైందనడానికి ఇదే ఆధారం’’ అన్నాడు ప్లీడర్ బసవరాజు.‘‘వందరూపాయలకు కూడా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు దొరికే ఈరోజుల్లో ఇలాంటివి బోలెడు సంపాదించవచ్చు’’ అని తేలికగా ఆ సర్టిఫికెట్‌ను తీసేశాడు ప్లీడర్ బాల్‌రాజు. అంతేకాదు...‘‘నా కేసులో నిజం తేల్చడానికి బసవరాజును ఎగ్జామిన్ చేయాలి. విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ’’ అని జడ్జివైపు గౌరవపూర్వకంగా చూశాడు బాల్‌రాజు.ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్లు ఆబగా...‘‘యస్. యూ కెన్ ప్రొసీడ్’’ అని అనుమతి ఇచ్చారు జడ్జిగారు.బసవరాజు బోనులోకి వచ్చాడు. బాల్‌రాజు ప్రశ్నల ఆయుధం అందుకున్నాడు...‘‘మీకు గోపాలకృష్ణగారు ఎంతకాలంగా తెలుసు?’’‘‘పది పదిహేనేళ్లుగా తెలుసు. వాళ్ల కంపెనీకి నేనే లీగల్ అడ్వైజర్‌ని. పైగా... హీ వాజ్ క్లోజ్‌ఫ్రెండ్ ఆఫ్ మైన్’’‘‘ఐసీ. అంత క్లోజ్ఫ్రెండై ఉండి ఈ లీగల్ అడ్వైజర్గారు పెళ్లికి ఎందుకు వెళ్లలేకపోయారు?’’‘‘వెళ్లేవాణ్ణే. కానీ వాళ్లకు పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే’’‘‘ఆన్సర్ టు ద పాయింట్ సార్. మీరు ఆ పెళ్లికి వెళ్లారా లేదా?’’‘‘వెళ్లలేదు’’బసవరాజు చెప్పింది అబద్ధమని పదినిమిషాల్లో నిరూపించాడు బాల్‌రాజు.‘‘మీ ముందు మరో బలమైన సాక్ష్యం ప్రవేశపెడతాను’’ అని జడ్జిగారి అనుమతి కోరాడు. ఆ సాక్షి మనిషి కాదు.టీవీ! ఆ టీవీ ఠీవిగాకోర్టుహాలులోకి వచ్చి నిజమేమిటో చెప్పింది... కాదు... కాదు... చూపించింది. టీవీలో గోపాలకృష్ణ పెళ్లి వీడియో రన్ అవుతోంది. అందులో ప్లీడర్ బసవరాజు చాలా స్పష్టంగా కనిపించాడు!‘పోల్చుకున్నారా బసవరాజుగారూ. ఇది డ్యూయెల్ రోల్ కాదు. మీరే’’ బసవరాజును వెక్కిరింపు ధోరణిలో అన్నాడు బాల్‌రాజు.తేలుకుట్టిన దొంగైపోయాడు బసవరాజు!‘‘ఈ కేసును నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకు వారసురాలిని చేయాలని మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా ఆస్తుల కంటే మించిన సౌభాగ్యం ఏముంటుంది? కానీ, ఆ సౌభాగ్యాన్ని చేతులారా తుడిచేసిన దుర్మార్గుల్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది.ఒక ఆడదాన్ని ఎంతమంది హింసించారు? ఆమె కన్నీటికే గనుక శపించే శక్తి ఉంటే వీళ్లందరినీ సర్వనాశనం చేసి ఉండేది’’ బాల్‌రాజు డైలాగులకు కోర్టు హాలు అదిరిపడింది. బాల్రాజా మజాకా! మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి.నిందితుడు కోర్టు బోనులో ఉన్నాడు.‘‘మీకు పెళ్లై ఎంత కాలమైంది?’’‘‘23 ఏళ్లు. నా భార్య పేరు వర్ధనమ్మ’’‘‘మీకెంతమంది పిల్లలు?’’‘‘ఇద్దరు. ఆదిబాబు, గోపాలకృష్ణ’’‘‘జనరల్‌గా పెద్దపిల్లాడి పేరు మొదట చెబుతారు. ఆ.. అది వదిలేయండి. మీకు పుట్టింది సక్రమమైన సంతానమేనా?’’‘‘ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది?’’‘‘అలా అని రుజువులేమీ లేవు కదా.అయినా కోర్టువారు నమ్ముతారు లెండి. మీ పిల్లలే అని. మీకు పెళ్లై ఎన్ని సంవత్సరాలవుతుంది?’’‘‘ఆ... డిసెంబరు.... 1965’’‘‘అంతసేపు ఆలోచించారు. మరుపు సహజం. వయసు కదా, సరే 1966లో ఆదిబాబు మీకు పుట్టాడు కదా...అంటే గోపాలకృష్ణా, ఆదిబాబు కవలపిల్లలా?’’‘‘కాదు... గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు’’‘‘ఎన్నేళ్లు?’’‘‘పదకొండు’’‘‘అంటే, పదకొండేళ్ల ముందు నుంచే వర్ధనమ్మకు మీకు శారీరక సంబంధం ఉందన్నమాట!’’‘‘బాబూ... ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది’’‘‘పొరపాటు, సమాధానం చెప్పడంలోనా? పిల్లల్ని కనడంలోనా? చెప్పండి ఎన్నేళ్ల నుంచి?’’‘‘పెళ్లికి ముందు ఐదేళ్ల నుంచి’’‘‘ఐసీ. ఇంతవరకు గోపాలకృష్ణ మీకు అక్రమసంతానం అనుకున్నా. అసలు మీ కొడుకే కాదన్నమాట’’. ∙ -
నంద్యాలలో టీడీపీకి షాక్
సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నిక మరో నాలుగు రోజుల్లో జరగనుందనగా.. అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం డీఎస్పీ గోపాలకృష్ణపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్నాచితకా నాయకుల ఇళ్లపై అర్థరాత్రి సోదాలు అంటూ తలుపు తడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతల నుంచి ఈసీకి ఫిర్యాదు వెళ్లింది. డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. గోపాలకృష్ణ స్ధానంలో ఓఎస్డీ రవిప్రకాశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈసీ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముగ్గురు పరిశీకులను ఈసీ నియమించింది. ఒక ఉప ఎన్నికకు ఇంతమంది పరిశీలకును నియమించడం ప్రత్యేక సమయాల్లో మాత్రమే జరగుతుంటుంది. -
167వ ర్యాంకర్ శిష్యుడే గోపాలకృష్ణ
సాక్షి ప్రత్యేకం: 'రోణంకి గోపాలకృష్ణ' ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడో ప్రభజనం. తెలుగు మీడియం ద్వారా ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించిన గోపాలకృష్ణ ఎంతో మంది సివిల్స్ ఆశావాహులకు ఆదర్శంగా నిలిచారు. అయితే, సివిల్స్ కోసం పది సంవత్సరాలుపైగానే కష్టపడ్డారు గోపాలకృష్ణ. ఈ సమయంలో తాను ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. కోచింగ్ ఇవ్వడానికి సంస్ధలు ముందుకు రాలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఇన్ని కష్టాలను ఎదుర్కొన్న గోపాలకృష్ణ విజయం వెనుక ఉన్నది ఎవరో తెలుసా?. ఈ సివిల్స్ ఫలితాల్లోనే 167వ ర్యాంక్ సాధించిన బాల లత మల్లవరపు.. గోపాలకృష్ణకు శిక్షణ నిచ్చారు. బాల లత ఫేస్బుక్ అకౌంట్‌ను వీక్షించిన 'సాక్షి'కి ఈ విషయం తెలిసింది. గోపాలకృష్ణతో కలిసివున్న ఓ ఫోటోను తన వాల్లో పోస్టు చేసుకున్నారు బాల లత. 'గోపాలకృష్ణ రోణంకి.. నా విద్యార్థి- ఇన్నాళ్లకు నా కల సాకారమయ్యింది' ఇది ఆ పోస్టు సారాంశం. దానితో పాటు గోపాలకృష్ణతో కలిసి దిగిన ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. బాల లత ఏం చెప్పారంటే.. సివిల్స్‌లో 167వ ర్యాంక్‌ను సాధించిన బాల లతను సాక్షి టీవీ పలకరించింది. కింది స్ధాయి నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఐఏఎస్ కలను చేరుకోగలరని నిరూపించడానికి తాను సివిల్స్ రాసి సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. తాను ఐఏఎస్ ఉద్యోగాన్ని చేపట్టనని తెలిపారు. ఐఏఎస్ కావాలని కలలుగనే వారికి శిక్షణను ఇస్తానని ఉద్వేగంగా చెప్పారు. -
19, 26న గంటపాటు పెట్రోలు బంక్‌ల బంద్
పెట్రోల్ బంక్‌ల యూనియన్ వెల్లడి గుంటూరు రూరల్: డీలర్ మార్జిన్‌కు సంబంధించి 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అపూర్వచంద్ర కమిటీ నివేదికను ఇప్పటికీ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 19, 26 తేదీల్లో సాయంత్రం 7 గంటల నుంచి 8 వరకు పెట్రోల్ బంక్‌లను మూసివేయనున్నట్లు పెట్రోల్ బంక్‌ల అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు.శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 3, 4 తేదీల్లో పెట్రోల్ కొనుగోలును నిలిపివేస్తామని చెప్పారు. నవంబర్ 5న సాయంత్రం 6 వరకు మాత్రమే బంక్‌లు తెరిచి ఉంటాయని, అనంతరం బంద్ పాటించనున్నట్లు వెల్లడించారు. 6న పూర్తిగా బంద్ చేస్తామన్నారు.నవంబర్ 7 నుంచి ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రమే బంక్‌లను నిర్వహించాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి నెలలో 2, 4వ శనివారాలు, అలాగే ప్రతి ఆదివారం సెలవు దినాలుగా కమిటీ నిర్ణయించిందన్నారు. -
న్యాయమూర్తిగా...
మంచు లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు న్యాయమూర్తిగా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై వేళ్ల మౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెల 20న ప్రారంభం కానుంది. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ జరపనున్నాం. థ్రిల్లర్, కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం’’ అని చెప్పారు. -
వ్యవసాయ పొలాల్లో వ్యక్తి మృతి
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం రేఖవారిపల్లె సమీపంలో వ్యవసాయ పొలాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడ్ని గూటంవారిపల్లె గ్రామానికి చెందిన గోపాలకృష్ణ (35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. -
పోలీసులంటే భయమే లేదు
కేవలం మూడు రోజుల వ్యవధిలో జిల్లాలో పట్టపగలు జరిగిన రెండు దారుణ హత్యలు పోలీసుల పనితీరుకు పెనుసవాల్‌గా నిలిచాయి. పోలీసులంటే భయమే లేకుండా.. ఆ తర్వాత ఏం జరుగుతుందనే లెక్కే లేకుండా నిందితులు కిరాతకంగా హత్యలకు పాల్పడి పరారైన వైనాలు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. యాదృచ్ఛికమో కావొచ్చు గానీ జిల్లా కేంద్రం ఏలూరులో న్యాయవాది పీడీఆర్ రాయల్, గోదావరి తీర పట్టణం కొవ్వూరులో టీడీపీ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ హత్యలు పట్టపగలే చోటుచేసుకున్నాయి. హతులిద్దరూ సామాన్యులేం కాదు. గోపాలకృష్ణ మూడుసార్లు కౌన్సిలర్‌గా గెలుపొందడంతోపాటు పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. స్థానికంగా బీసీల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు. ఇక ఏలూరుకు చెందిన రాయల్ పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టగల న్యాయవాదిగానే కాకుండా కాపు సామాజికవర్గ నేతగా, నగర ప్రముఖునిగా వెలుగొందాడు. అటువంటి నేపథ్యం కలిగిన ఆ ఇరువురినీ నరికిచంపిన దారుణం చూస్తుంటే జిల్లాలో పోలీస్ పనితీరు ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. ఆ రెండు కేసుల్లో తేడా.. ప్రాణహాని ఉందని టీడీపీ కౌన్సిలర్ గోపాలకృష్ణ గతంలో ఎన్నోమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఖాకీల వైఫల్యం వల్లే టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడని స్వయంగా అధికార పార్టీకే చెందిన కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మండిపడ్డారు. దీంతో ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఒకటి రెండు రోజుల్లోనే కీలక నిందితులను అరెస్ట్ చేశారు. కానీ.. ఏలూరుకు చెందిన రాయల్ కేసును మాత్రం ఇంకా ఛేదించలేకపోయారు. కత్తులతో నరికి చంపిన ఓ నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టిచ్చినా పోలీసులు ఈ కేసులో ఏ మాత్రం పురోగతి సాధించలేకపోయారు. మిగిలిన నిందితులు పోలీసులకు చిక్కకుండా నేరుగా కోర్టులో లొంగిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే వాదనలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రాయల్ హత్య జరిగిన వెంటనే పోలీసులు పక్కా యాక్షన్ తీసుకుంటే నిందితులు దొరికేవారు. కానీ.. రాజకీయ నేపథ్యం ముడిపడి ఉండటంతో పోలీసులు ఒకింత ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే ఇప్పుడు కేసు క్లిష్టంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వాసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న రాయల్‌ను చూసేందుకు ఎవరెవరు వచ్చారు.. ఆ తర్వాత అంతిమ యాత్రలో ఎవరెవరు పాల్గొన్నారు.. వచ్చిన వారిలో పోలీసులెవరైనా ఉన్నారా.. అనే వివరాలను ఆరా తీయడంలో శ్రద్ధ చూపిన పోలీసులు అసలు నిందితులను పట్టుకునే పనిమాత్రం ఒకింత ఆలస్యంగానే చేపట్టారనే చెప్పాలి. సిఫార్సు పోస్టింగ్‌ల విపరిణామాలివి టీడీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉన్న వారికే పోస్టింగ్‌లు ఇచ్చే నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నిర్వాకం వల్లనే జిల్లాలో పోలీస్ పనితీరు ఇంత దారుణంగా తయారైందన్నది తిరుగులేని వాస్తవం. జిల్లాలో ఎక్కడికక్కడ పోలీసులు రాజకీయ క్రీనీడలో పనిచేస్తుండటం వల్లనే ఓ దశలో ఉన్నతాధికారులను కూడా లెక్కచేయని స్థితికి వెళ్లిపోయారు. ఇప్పుడు నడిరోడ్డుపై హత్యలు జరిగినా.. విచారణ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు తమకు సిఫార్సులు చేసిన రాజకీయ నేతలకు చుట్టుకుంటాయేమోనన్న భయం పోలీసులను వెంటాడుతోంది. ఆ భయంతో కొట్టుమిట్టుడుతున్న ఖాకీలు సామాన్య జనాలకు ఏం భద్రత కల్పిస్తారు. ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉన్న వారికి ఏం రక్షణ కల్పిస్తారు.. వాస్తవాలు రాసే జర్నలిస్టులపైనా కత్తిగట్టిన దళారులను ఎలా కట్టడి చేస్తారన్నది ఆ దేవుడికే ఎరుక! నెలాఖరు నాటికి పూర్తి ప్రతి మండలం, ప్రతి గ్రామంలో రైతుల సాగు వివరాలు నమోదు చేయించి ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నాం. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఈ యాప్‌ను రైతులకు, ప్రజలకు, అధికారులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ యాప్ ఆధారంగానే ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది.- మహ్మద్హసీం షరీఫ్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
కొవ్వూరులో కౌన్సిలర్ దారుణ హత్య
కొవ్వూరు మండలం ఔరంగాబాద్ గ్రామానికి వెళ్లే రోడ్డులో పాత గోపాలకృష్ణ(52) అనే టీడీపీ కౌన్సిలర్ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఆయనను కత్తులతో నరికి చంపారు. కొవూరులో ఓ విందుకు హాజరై తిరిగి స్వగ్రామం ఔరంగాబాద్ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదో తుత్తి!
బాపు-రమణలు తీర్చిదిద్దిన సుందరచిత్రం ‘మిష్టర్ పెళ్లాం’. ఇందులో గోపాలకృష్ణ పాత్రకు నత్తి పెట్టకపోయుంటే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. చాలా వెలితిగా ఉండేది కదూ! ఆ నత్తే మనకింత తుత్తినిచ్చింది మరి. మైనస్ అనుకున్న దాన్ని కూడా ప్లస్సుగా చూపడమంటే ఇదే. ఏవీయస్ చనిపోయి ఏడాది గడిచినా చిరంజీవిగా మిగిలిపోయారంటే ఇలాంటి తుత్తి పాత్రల వల్లనే! ఈ పాత్ర పేలుతుందని ముందే అనుకున్నా! బాపు-రమణలకు సన్నిహితుడైన శ్రీరమణ ద్వారా ఏవీయస్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టు గుర్తు. నటనతో పాటు రచయితగా కూడా ప్రయత్నాలు చేస్తుండేవారు. మా ‘మిష్టర్ పెళ్లాం’ సిట్టింగ్స్‌కి కూడా వచ్చేవారు. ఏవీయస్ ఓ నాటకంలో తుత్తి పాత్ర చేశారట. ఆ ట్రాక్ బాపు-రమణలకు చెబితే, ఇంప్రెస్ అయ్యి ఈ స్క్రిప్టులో అందంగా ఇమిడ్చారు. ఆ తర్వాత ఆ పాత్రను ఏవీయస్నే చేయమన్నారు. ఈ పాత్ర బాగా పేలుతుందని షూటింగ్ దశలోనే అనుకున్నా. - గవర పార్థసారథి, నిర్మాత జామకాయలు ఇస్తే ఒకరోజు గుర్తుపెట్టు కుంటారు. మామిడి కాయలు ఇస్తే మాసమంతా తలచుకుంటారు. మరి - లెంపకాయలు ఇస్తే జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎనీ డౌట్స్! ఆ రోజు గోపాలకృష్ణ చాలా బిజీగా ఉన్నాడు. మరి కాస్సేపట్లో బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ మీటింగాయె! తను మేనేజింగ్ డెరైక్టరు. తండ్రి చైర్మను. ఇలాంటి గజిబిజీ టైములో ఫోను మోగింది. అవతల పి.ఎ.... ‘‘సార్ మీ కోసం లేడీసొచ్చారు’’. గోపాలకృష్ణ అవాక్కయ్యాడు. ‘‘ఎ... ఎంతమంది?’’ అనడిగాడు. పి.ఎ. ఫకాలున నవ్వేసి ‘‘ఓహో... లేడీసంటే బోలెడంత మంది అనుకున్నారా? ఒక్కరే’’ అని చెప్పాడు. ‘‘ఏ... ఏం పేరు... ఎందుకొచ్చారో కనుక్కో?’’ ఆర్డరేశాడు గోపాలకృష్ణ. ‘‘ఎవరో శివంగి అట సార్’’ అని పి.ఎ. చెప్పగానే గోపాలకృష్ణ ఒక్కసారి తన కుడి చెంప తడుముకున్నాడు. అతని కళ్ల ముందు ఓ పిక్చర్ కనబడింది. శివంగి అంటే ఝాన్సీలక్ష్మి. ఇంటర్లో క్లాసుమేటు. ‘‘ఆమెను తీసుకుని నా చా... ఛాంబర్‌కి రా!’’ అని పురమాయించేశాడు. శివంగిని చూడగానే గోపాలకృష్ణ కళ్లు మెరిశాయి. ఒక్కసారి కాలేజీ డేస్ అన్నీ గిర్రున గుర్తొచ్చాయి. అతని ఉత్సాహం, చిన్నపిల్లాడిలా సంబరపడటం చూసి ‘‘నువ్వేం మారలేదు గోపాల్’’ అంది శివంగి అనబడే ఝాన్సీలక్ష్మి. ఈలోగా కాఫీ వచ్చింది. ‘‘ఎ... ఎన్నాళ్లయ్యింది శివంగీ... నిన్ను చూసి! ఎక్కడున్నావ్? మీ ఆయనేం చేస్తుంటాడు? పిల్లలా?’’ అని టకటకా ప్రశ్నలు సంధించాడు గోపాలకృష్ణ. కాఫీ సిప్ చేస్తూనే తన గురించి చెప్పింది శివంగి. అలా ఇద్దరూ కాసేపు పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ‘‘శివంగి అనగానే టక్కున గుర్తుపట్టేశావ్?’’ అంది శివంగి చిలిపిగా. ‘‘ఎ... ఎందుకు పట్టను శివంగీ. నువ్విచ్చిన లెంపకాయ అంత ఈజీగా మరిచిపోతానా? నన్ను గుర్తుంచుకుని ఇంత దూరం వచ్చావ్. నాకదే తుత్తి’’ చెప్పాడు గోపాలకృష్ణ. శివంగి కొంచెం కన్ఫ్యూజింగ్గా ‘‘తుత్తి ఏంటి?’’ అడిగింది. ‘‘తుత్తి... తుత్తి... శాటిస్ఫేక్షన్’’ చెప్పాడతను. ‘‘ఓహో... యూ మీన్ తృప్తి’’ అందామె నవ్వుతూ. చిన్నప్పటి ఈ క్లాస్మేట్ తన కంపెనీలో ఉద్యోగాని కొచ్చిందని తెలియగానే గోపాలకృష్ణ అగ్గగ్గలాడిపోయాడు. ఫ్రెండ్‌కు ఏ ఉద్యోగం ఇవ్వడానికైనా తాను రెడీ. ఈలోగా మీటింగు మొదలైంది. చైర్మన్, ఇంకొందరు డెరైక్టర్లు రెడీ. కంపెనీ సేల్స్ పెంచడానికి ఎవడో ఒకతను బోడి సలహా ఇచ్చేసరికి, శివంగి పగలబడి నవ్వేసింది. చైర్మన్‌కి కోపం వచ్చింది. మిగతా డెరైక్టర్లూ సేమ్ టూ సేమ్. ‘‘నా ఫ్రెండు’’ అంటూ గోపాలకృష్ణ ఏదో కవర్ చేయబోయాడు. చైర్మన్ ఊరుకోలేదు. ‘‘నువ్వీ మీటింగ్‌కి ఎందుకొచ్చావని అడగడం లేదు. ఎందుకు నవ్వావో చెప్పు’’ అని చైర్మన్ గద్దించాడు. ‘‘మీ కంపెనీ సేల్స్ పెంచడానికి మీరు పడుతున్న తిప్పలు చూసి నవ్వొచ్చింది. ఓ మధ్య తరగతి గృహిణిగా నేను కొన్ని సలహాలు చెప్తాను. ఇలా పాటించి చూడండి’’ అంటూ శివంగి చకచకా చిట్కాలు చెప్పేసింది. చైర్మన్ వండరైపోయాడు. ‘‘మా అన్నపూర్ణ ఫుడ్ కార్పొరేషన్ సేల్స్ డిపార్ట్మెంట్కి నిన్ను వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నా. వన్ ఇయర్ కాంట్రాక్ట్. నెలకు పదివేల జీతం... క్వార్టర్స్... ఫోను... కారు... ఇస్తాం’’ అని చెప్పి అప్పటికప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ! ఆ తర్వాత రోజు - శివంగిని ఆఫీసుకు తీసుకు రావడానికి స్వయంగా ఇంటికి వెళ్లాడు గోపాలకృష్ణ. శివంగి భర్త బాలాజీని పరిచయం చేసుకున్నాడు. భార్యకు ఇంత పెద్ద ఉద్యోగం రావడం బాలాజీకి కడుపుమంటగా ఉంది. దానికి తోడు గోపాలకృష్ణ ఇంటికి రావడంతో ఒళ్లు మంటగా ఉంది. అందుకే గోపాలకృష్ణపై ఎన్నో చెణుకులు. చివరకు అతని నత్తిని కూడా అనుకరించాడు. పాపం గోపాలకృష్ణ కల్మషం లేనివాడు. ఈ కడుపుమంటలు, ఉక్రోషాల గురించి అస్సలు తెలియవు. ఝాన్సీ తన ఫ్రెండు. ఝాన్సీ భర్త కూడా తన ఫ్రెండే. ఫ్రెండ్ కాకపోతే ఇంకెవరు కామెంట్ చేస్తారు. గోపాలకృష్ణ ఆఫీసు ఎంత విశాలమో, అతని హృదయమూ అంతే విశాలం! గోపాలకృష్ణ కంపెనీలో కృష్ణాష్టమిని ప్రతి ఏటా గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఆఫీసు వాళ్లంతా కుటుంబ సభ్యులతో సహా రావాల్సిందే! శివంగికి చెబితే సరిపోతుంది. కానీ కర్టెసీ కొద్దీ బాలాజీని తనే స్వయంగా ఫోన్ చేసి మరీ ఇన్వైట్ చేశాడు గోపాలకృష్ణ. బాలాజీ నిజానికి మంచివాడే. కానీ అసూయ ఆ మంచితనాన్ని డామినేట్ చేసేస్తోంది. దానికి తోడు గోపాలకృష్ణ-ఝాన్సీల ఫ్రెండ్షిప్ పుండు మీద కారం చల్లుతోంది. గోపాలకృష్ణ కూడా సతీసమేతంగా ఆ ఫంక్షన్కొచ్చాడు. శివంగిని తన శ్రీమతికి ఇంట్రడ్యూస్ చేశాడు. ‘‘నన్ను లెంపకాయ కొట్టిందని చెప్పానే... తనే... శివంగి. కొంచెం ఉంటే నీ ప్లేసులోకి రావాల్సింది’’ అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ. గోపాలకృష్ణ శ్రీమతి కోమలాదేవి కూడా అంతే ఇదిగా నవ్వుతూ, ‘‘ఇప్పటికి 972 సార్లు చెప్పారు మీ లెంపకాయ గురించి’’ అంది. గోపాలకృష్ణ కేరెక్టర్ అంతే. ఏదీ మనసులో దాచుకోడు. అంతా ఓపెనే. వాళ్ల కంపెనీ ప్రొడక్ట్స్‌లో కల్తీ ఉండనట్టే, ఇతని ఆలోచనల్లోనూ, మనసులోనూ కల్తీనే ఉండదు. శివంగి ఫ్యామిలీలో ఏదో డిస్ట్రబెన్స్ ఉందని గోపాల కృష్ణ కనిపెట్టాడు. కానీ బయటపడలేదు. పడితే శివంగి ఫీలవుతుంది. అందుకే శివంగికి ఓ ఫ్రెండ్‌లాగా... ఓ బ్రదర్‌లాగా వెన్నుదన్నుగా నిలబడ్డాడు. బాలాజీ విషయంలో శివంగి తొందరపడితే క్లాసు పీకాడు. మార్గం చూపాడు. ఇప్పుడు బాలాజీ - శివంగి ఒకటయ్యారు. వాళ్ల చుట్టూ ముసురుకున్న మేఘాలన్నీ తొలగిపోయాయి. ‘‘మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకెంతో ‘తుత్తి’గా ఉంది’’ అన్నాడు గోపాలకృష్ణ. బాలాజీ కూడా తుత్తిగా నవ్వాడు. అవును... తుత్తి తోడుంటే ఆనందం మీ వెంటే! - పులగం చిన్నారాయణ తుత్తి... నా పాలిట అదృష్టం! - ఏవీఎస్ ‘అతలు కిత్నాత్తమి అంతే ఏంతంతే... (అసలు కృష్ణాష్టమి అంటే ఏంటంటే...) డైలాగ్‌ని ఫస్ట్‌షాట్‌గా తీశారు. కొద్దిసేపట్లో సీన్ తీస్తారనగా... విజయవాడలో ఉండే మా అక్కయ్య చనిపోయిందని కబురొచ్చింది. నా వల్ల షూటింగ్ క్యాన్సిల్ కాకూడదు. అందుకే బాధ దిగమింగుకుని, కన్నీళ్లు ఆపుకుని సీన్ పూర్తి చేశాను. 1993 ఆగస్టు 5న ‘మిష్టర్ పెళ్లాం’ రిలీజైంది. నా జీవితం తుత్తిగా సాగడానికి మార్గం ఏర్పడింది. నాకు ఈ పాత్ర ఎనలేని గుర్తింపునూ, స్థిరత్వాన్నీ తెచ్చిపెట్టింది. అందుకే ‘తుత్తి’ నా పాలిట అదృష్టం. (‘తుత్తి’ పాత్ర గురించి గతంలో ఏవీయస్ చెప్పిన మాటలు ) హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: మిష్టర్ పెళ్లాం (1993); డెరైక్ట్ చేసింది: బాపు సినిమా తీసింది: గవర పార్థసారథి; మాటలు రాసింది: ముళ్లపూడి వెంకటరమణ -
ఇండియన్ డిజైన్ గార్మెంట్స్‌లో విస్తృత తనిఖీలు
పరిగి : పరిగిలోని ఇండియన్ డిజైన్ గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్వాహకులు సమీపంలోని జయమంగళి నది నుంచి ఫ్యాక్టరీలో భవనాల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలింపులపై మండల రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఫ్యాక్టరీలో ఇసుక అక్రమ నిల్వలపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించింది. స్పందించిన తహశీల్దార్ గోపాలకృష్ణ రెవెన్యూ సిబ్బంది సహాయంతో ఫ్యాక్టరీలోకి మంగళవారం వెళ్లి భారీ ఇసుక నిల్వలను గుర్తించారు. సుమారు70-80 ట్రాక్టర్ల పరిమాణంలో ఇసుక నిల్వలను గుర్తించిన తహశీల్దార్ ఫ్యాక్టరీ సిబ్బందిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఇన్చార్జి సందీప్‌తో మాట్లాడిన తహశీల్దార్ ఎవరి అనుమతితో ఈ ఇసుకను తరలించారని ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రుసుం చెల్లించకుండా వందలాది ట్రాక్టర్ల ఇసుకను తరలించేందుకు మీకెంత ధైర్యమని నిలదీశారు. ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న ఇసుకను సీజ్ చేస్తున్నామని, ఈ ఇసుకను కట్టడాలకు వాడితే అదనంగా మరో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఫ్యా క్టరీ నుంచి జయమంగళి నదిలోని ఫ్యాక్టరీ వారు ఏర్పాటు చేసుకున్న అడ్డదారిని తహశీల్దార్ పరిశీలించారు. అనంతరం జయమంగళి నదిలోకి వెళ్లి ఎంత పరిమాణంలో ఇసుక తరలించారనే విషయాలను గుర్తించారు. అ నంతరం ఫ్యాక్టరీలో ఇసుక డంపులను గుర్తించిన విషయాన్ని తహశీల్దార్ గోపాలకృష్ణ ఆర్డీవో రామ్మూర్తికి తెలిపారు. తహశీల్దార్ వెంట ఆర్ఐ సుబ్బారావు, వీఆర్వో రఘు, సిబ్బంది ఉన్నారు. అక్రమ ఇసుక తరలింపుపై ‘సాక్షి’ కథనం వెలువడిన వెంటనే ఫ్యాక్టరీలోని భారీ ఇసుక నిల్వలను వేరే ప్రదేశాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించడం గమనార్హం. -
ఇంత నిర్లక్ష్యమా...?
సాక్షి, గుంటూరు : ఆరు దశాబ్దాల కల నెరవేరబోతోందన్న ఆశ జిల్లా ప్రజలకు తీరడంలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరింత జాప్యమమయ్యేలా ఉంది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జీజీహెచ్‌లో గుండె ఆపరేషన్లు నిర్వహించాలంటూ ప్రభుత్వం జీఓ జారీచేసినప్పటికీ జీజీహెచ్ అధికారుల నిర్లక్ష్యం పేద గుండెలకు శాపంగా మారుతోంది. నవంబర్ 1వ తేదీనే జీజీహెచ్‌లో పీపీపీ పద్ధతి ద్వారా గుండె ఆపరేషన్లు నిర్వహించేందుకు ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ముందుకు వచ్చారు. ఆపరేషన్లకు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఇక్కడి హార్ట్లంగ్మెషిన్ మూలనపడటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కొత్తది కొనుగోలు చేసి ఆపరేషన్లు మొదలుపెట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని పాతగుంటూరుకు చెందిన ఓ బాలికకు గుండె ఆపరేషన్ నిర్వహించేందుకు నవంబర్ మొదటి వారంలో ముహూర్తం ఖరారు చేశారు. దానికి వచ్చిన ప్రముఖ గుండె వైద్యనిపుణులు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే జీజీహెచ్‌లోని ఆపరేషన్ థియేటర్లు, తదితరాలను పరిశీలించి ఆపరేషన్ నిర్వహించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. జీజీహెచ్‌లో మిలీనియం బ్లాక్ ఏర్పాటు తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) పద్ధతి ద్వారా గుండె ఆపరేషన్లు నిర్వహించాలని తలపెట్టారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు ఈ విషయాన్ని నాలుగు నెలల క్రితం గుంటూరు పర్యటనకు వచ్చిన సమయంలో జీజీహెచ్ అధికారులకు తెలియజేశారు. అయితే ఆసుపత్రిలోని కొంతమంది ప్రభుత్వ వైద్యులు ఈ విధానాన్ని వ్యతిరేకించినప్పటికీ గుండెరోగులను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు సైతం పీపీపీ పద్దతిలో ఆపరేషన్లు నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆపరేషన్ చేసే వైద్యుడు ఉన్నా ఆపరేషన్ చేయూల్సిన పరికరం మూలనపడటం, ఇప్పటి వరకూ కొత్త మెషిన్ కొనుగోలు చేయకపోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కనీసం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జీజీహెచ్‌లో గుండె ఆపరేషన్లు జరుగుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలేలా ఉంది. గుండె ఆపరేషన్లు జరగాలంటే మరోసారి సుమారు రూ. 70 లక్షలు వెచ్చించి కొత్త హార్ట్లంగ్మెషిన్ కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు జీజీహెచ్ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అనుకున్న గడువు దాటుతున్నా ఏమి పట్టనట్లు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డీఎంఈతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం జీజీహెచ్‌లో గుండె ఆపరేషన్లు నిర్వహించడానికి కొంత సమయం పడుతుంది. గుండె వైద్య విభాగంలో హార్ట్‌లంగ్ మెషిన్‌తో పాటు మరికొన్ని పరికరాలు రావాల్సి ఉంది. ఇవి వచ్చిన తరువాత ఆపరేషన్లు మొదలయ్యేలా చర్యలు చేపడతాం. - డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
బీహార్ దొంగల బీభత్సం
భీమవరం అర్బన్ :భీమవరంలో బీహార్ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టుకోవడానికి ప్రయత్నించిన స్థానికులు, పోలీసులపై నాటుతుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ధైర్యంతో ముందుకు దూకిన పాలకోడేరు కానిస్టేబుల్ వై.వెంకటేశ్వరరావు వెంట్రుక వాసిలో బుల్లెట్ నుంచి తప్పించుకున్నాడు. తుపాకీ కాల్పుల శబ్దాలకు ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు ఒక దొంగ పోలీసులకు చిక్కగా, మరో ఇద్దరు పరారయ్యారు. అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమందించి అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో స్థానిక పోలీసులు భీమవరం సరిహద్దుల్లో మోహరించి, వాహనాల తనిఖీ ప్రారంభించారు. వివరాలు ఇవి.. విజయవాడకు చెందిన విస్సంశెట్టి కనకదుర్గ అనే 65 ఏళ్ల వృద్ధురాలు స్థానిక కారుమూరి వారి వీధిలో నివసిస్తున్న తన కుమారుడు గోపాలకృష్ణ ఇంటికి వచ్చారు. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో మావుళ్లమ్మ ఆలయానికి ఒంటరిగా వెళ్లి వస్తూ మధ్యతో తటవర్తి వారి వీధిలో చెరుకురసం తాగేందుకు ఆగాడు. బీహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి చెరుకురసం తాగారు. కనకదుర్గ అక్కడ నుంచి సమీపంలోని తన కుమారుని ఇంటికి బయలుదేరడంతో ఆమె వెనుకనే వచ్చిన వారు అదను చూసి ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. దీంతో కిందపడిన కనకదుర్గ కేకలు వేయడంతో స్థానికులు విషయం తెలుసుకుని బైక్‌ను వెంబడించారు. నాచువారి సెంటర్ వద్ద వారు కనిపించడంతో స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో అటునుంచి వస్తున్న పాలకోడేరు పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కూడా వారిని వెంబడించాడు. మరో వైపు వన్‌టౌన్ పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇద్దరు దొంగలు బైక్‌పై పరార్ కాగా ఒకడు పరుగు తీశాడు. బీవీ రాజు మునిసిపల్ పార్క్ సమీపంలోని పావని గార్మెంట్స్ రోడ్లో అతను పరిగెత్తటంతో వెంబడించిన స్థానికులను దగ్గరకు రావద్దంటూ హెచ్చరించాడు. అయినా కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, స్థానికులు వెంటపడ్డారు. తన వద్ద ఉన్న నాటుతుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపిపాడు. ఒక బుల్లెట్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తలపక్కగా దూసుకువెళ్లింది. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై విజయకుమార్, సిబ్బంది, పోలీసులు కూడా తోడు కావడంతో ధైర్యం చేసి దొంగను పట్టుకోగలిగారు. అతడిన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి వివరాలు సేకరిస్తున్నారు. టౌటౌన్ సీఐ జయసూర్య స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. బీహార్ నుంచి ఎంతమంది వచ్చారు, తప్పించుకున్న వారు ఎక్కడికి వెళ్ళారు తదితర వివరాలను చెప్పించే ప్రయత్నం సీఐ జయసూర్య చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న నరసాపురం డీఎస్సీ రఘువీరారెడ్డి హుటాహుటిన భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. నిందితుడు బీహార్‌కు చెందినవాడైనప్పటికీ తెలుగులో మాట్లాడుతున్నాడు. దీంతో చాలా కాలంగా నిందితులు ఈ ప్రాంతంలోనే నివశిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగలు తుపాకీతో కాల్పులు జరపడం ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది. -
బళ్లారిలో కాంగ్రెస్ ఘన విజయం
ఫలించిన డీకేశి ఎత్తులు సాక్షి, బళ్లారి : బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై. గోపాలకృష్ణ 33,104 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 50,795 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై గోపాలకృష్ణకు 83,899 ఓట్లు లభించడంతో భారీ మెజార్టీతో గెలుపొందినట్లయింది. ఈ నెల 21న జరిగిన బళ్లారి ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపును సోమవారం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా, అందులో ఇరు పార్టీలకు సమానంగా వచ్చాయి. తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లోను కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై. గోపాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఓబుళేసుపై మెజార్టీ ప్రదర్శిస్తూ వచ్చారు. మొత్తం 15 రౌండ్లు ఓట్లు లెక్కించగా అందులో ప్రతి రౌండ్లోను బీజేపీపై కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించింది. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ గెలుపొందాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయినా మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి శ్రీరాములు హ్యాట్రిక్ సాధించారు. అయితే ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీరాములు కోటలో కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారని తెలియడంతో కౌంటింగ్ కేంద్రం వద్దకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బళ్లారి జిల్లా ఓటర్లు రెండు సార్లు ఎన్వై హనుమంతప్పను తిరస్కరించారు. మూడోసారి అయినా తమను బళ్లారి ప్రజలు ఆశీర్వదిస్తారనే ఆశతో ఆయన సోదరుడు గోపాలకృష్ణ ఈ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. బళ్లారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ ఇన్ఛార్జిగా పని చేశారు. డీకే శివకుమార్ వ్యూహాత్మంగా ఎన్నికల్లో తనదైన శైలిలో పని చేశారు. బీజేపీ, జేడీఎస్ నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంతోపాటు అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడంతో ఎన్నికల్లో ఘన విజయం కారణమైందని చెప్పవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించడంతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, డీసీసీ అధ్యక్షుడు జేఎస్. ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ కే.ఎస్. ఎల్స్వామి, స్థానిక కాంగ్రెస్ నేతలు రాంప్రసాద్, అసుండి వన్నూరప్ప తదితరులు కౌంటింగ్ సెంటర్‌కు చేరుకుని ఎన్వై. గోపాలకృష్ణను అభినందించారు. అనంతరం టాప్ లేని వాహనంపై నగర వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. -
కాంగ్రెస్ అభ్యర్థులు వీరే...
ఎన్నికలకు జేడీఎస్ దూరం ‘ఉప’ ఖర్చు భరించలేమన్న దేవెగౌడ ఇతర పార్టీలకు మద్దతు కూడా ఉండదని ప్రకటన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో మూడు శాసన సభ స్థానాలకు ఈ నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. బళ్లారి గ్రామీణ నియోజక వర్గానికి ఎన్వై. హనుమంతప్ప సోదరుడు ఎన్.వై.గోపాలకృష్ణ, శివమొగ్గ జిల్లా శికారిపురకు మాజీ ఎమ్మెల్యే శాంత వీరప్ప గౌడ, చిక్కోడి-సదలగ స్థానానికి మాజీ మంత్రి ప్రకాశ్ హుక్కేరి తనయుడు గణేశ్ హుక్కేరి పేర్లను కేపీసీసీ అధిష్టానానికి సిఫార్సు చేసింది. ఎన్.వై. గోపాలకృష్ణ చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు మాజీ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో ఈయన ఓటమిపాలయ్యారు. స్థానికేతరుడైన గోపాలకృష్ణను బళ్లారి గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానిక నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా, బీజేపీ ఇదివరకే తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బళ్లారి గ్రామీణ నియోజక వర్గానికి ఓబులేశు, శికారిపురకు మాజీ సీఎం యడ్యూరప్ప తనయుడు బీవై. రాఘవేంద్ర, చిక్కోడి-సదలగ స్థానానికి మహంతేశ్ కవటగి మఠలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి నుంచి బీ. శ్రీరాములు, శివమొగ్గ నుంచి యడ్యూరప్ప, చిక్కోడి నుంచి ప్రకాశ్ హుక్కేరిలు ఎన్నికవడంతో ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది. జేడీఎస్ దూరం ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ. దేవెగౌడ తెలిపారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ధనవంత పార్టీలని తెలిపారు. వాటితో సమానంగా తమ పార్టీ ఎన్నికల్లో ఖర్చు చేయలేదని చెప్పారు. కనుక ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదని అనుభవ పూర్వకంగా చెబుతున్నానని వెల్లడించారు. అంతమాత్రాన తాము ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి మద్దతునిచ్చే ప్రసక్తే ఉండబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుందని తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్టీ బలోపేతంప దష్టి సారించలేదని చెబుతూ, త్వరలో రాష్ట్ర పర్యటన చేపడతానని చెప్పారు. ఇందులో భాగంగా ఆగస్టులో నగరంలోని ప్యాలెస్ మైదానంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పోటీ చేయకూడదనుకున్నా... ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ సీనియర్ నాయకులు నిర్ణయించారని సమావేశంలో పాల్గొన్న మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. అయితే పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. స్థానిక నాయకులతో చర్చించి దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. -
ఫొటోలు తీసింది ఆయనే ..!
*రాష్ట్ర ప్రభుత్వానికి సీఐడీ నివేదిక *స్పష్టం చేసిన సీఐడీ డీజీపీ బిపిన్ గోపాలకృష్ణ *ఔరాద్కర్‌కు క్లీన్చిట్ ! *న్యాయ పోరాటం చేస్తాం : రవీంద్రనాథ్ *ఎస్ఐ రవిపై చర్యలకు సిఫార్సు బెంగళూరు : ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవ రూపును దాలుస్తున్నాయి. ఇందుకు రాష్ట్ర సీఐడీ ఇచ్చిన నివేదికలు అదే స్పష్టం చేస్తున్నాయి. గతనెల ఓ కాఫీ షాప్‌లో యువతుల ఫొటోలు తీశారని కేఎస్ఆర్పీ ఏడీజీపీ రవీంద్రనాథ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌసిక్ ముఖర్జీకి ఐదు పేజీల నివేదిక సమర్పించామని సీఐడీ డీజీపీ బిపిన్ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. మే 26న ఉదయం బెంగళూరులోని కన్నింగ్హ్యాం రోడ్డులోని ఓ కాఫీ షాప్‌లోకి వచ్చిన కేఎస్‌ఆర్‌సీ ఏడీజీపీ రవీంద్రనాథ్ పక్క టేబుల్లో కూర్చున్న యువతిని ఫొటోలు తీశారనే ఆరోపణ తీవ్ర దుమారం రేగింది. కాగా ఆయనపై హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర సంచలనం రేగడంతో రాష్ట్ర ప్రభుత్వం కేసు విచారణ మొత్తం సీఐడీకి అప్పగించింది. కేసును ఆది నుంచి జాగ్రత్తగా విచారణ చేసిన సీఐడీ పోలీసులు రవీంద్రనాథ్ మొబైల్‌ను గుజరాత్ గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అంతకు ముందు ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు నగర పోలీస్ కమిషనర్ ఔరాద్కర్‌తో పాటు డీసీపీ రవికాంత్ గౌడ కూడా విచారణ ఎదుర్కొన్నారు. అయితే సీఐడీ పోలీసులు ఔరాద్కర్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. ఏడీజీపీని ఎవ్వరూ లాకప్‌లో వేయలేదని, ఆయనే లాకప్‌లోకి వెళ్లారని సీఐడీ నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉంటే రవీంద్రనాథ్‌పై హైగ్రౌండ్స్ పోలీసులు సెక్షన్ 354, 506, 509 కింద కేసులు నమోదు చేశారు. అయితే సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికలో సెక్షన్ 509 మాత్రమే రవీంద్రనాథ్‌పై కేసు నమోదు చెయ్యాలని సిఫార్సు చేసింది. ఎస్ఐని సస్పెండ్ చెయ్యండి : సీఐడీ *ఈ కేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన హైగ్రౌండ్స్ పీఎస్ ఎస్ఐ రవిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ నివేదికలో పేర్కొంది. ఉన్నతాధికారి అని తెలిసి కూడా దురుసుగా వ్యవహరించాడని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కోర్టును ఆశ్రయిస్తాం : న్యాయవాదులు * ఏడీజీపీ రవీంద్రనాథ్‌పై నమోదైన సెక్షన్ 354, 506లను సీఐడీ అధికారులు తొలగించారని, ఈ కేసు నుంచి ఆయనను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలి న్యాయవాదులు పేర్కొన్నారు. కోర్టును ఆశ్రయిస్తామన్నారు. నేను ఫొటోలు తియ్యలేదు : ఏడీజీపీ *యువతి ఫొటోలు తాను తియ్యలేదని ఏడీజీపీ రవీంద్రనాథ్ అంటున్నారు. అనవసరంగా తనపై కేసు నమోదు చేశారని, కోర్టును ఆశ్రయిస్తామని రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. -
కాలినడకన విచారణకు..
సీఐడీ డీజీపీ ఎదుట హాజరైన ఏడీజీపీ రవీంద్రనాథ్ తనను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి కుదరదన్న సీఐడీ డీజీపీ బిపిన్ గోపాలకృష్ణ రవీంద్రకు మద్దతుగా దళిత సంఘాల ధర్నా బెంగళూరు, న్యూస్‌లైన్ : కర్ణాటకలో ఐపీఎస్ అధికారుల మధ్య చిచ్చురేపిన ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్ కేసు రోజుకోమలుపు తిరుగుతోంది. శనివారం ఆయన ఇక్కడి హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని ఇంటి నుంచి కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటు నేరుగా చాలుక్య సర్కిల్ సమీపంలోని సీఐడీ కార్యాలయం చేరుకున్నారు. సీఐడీ డీజీపీ బిపిన్ గోపాలకృష్ణ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తనను అరెస్టు చేసి స్టేట్మెంట్ రికార్డు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పరిస్థితుల్లో అరెస్ట్ చెయ్యడం కుదరదని బిపిన్ గోపాలకృష్ణ స్పష్టం చేయడంతో రవీంద్ర బయటకు వచ్చారు. అక్కడి నుంచి సీఐడీ విభాగం ఏడీజీపీ గర్గ్ ఎదుట హాజరై తనను అరెస్ట్ చేయాలని కోరారు. ఆయన కూడా అరెస్ట్ కుదరదని చెప్పడంతో, కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్పీ రాజప్ప ఎదుట హాజరయ్యారు. ఆయన కూడా అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన ంతరం బయటకు వచ్చిన రవీంద్రను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ తనను కేఎస్ఆర్పీ నుంచి బదిలీ చేశారని, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం తనకు వాహనం కూడా లేదని, సంఘటన రోజు హైగ్రౌండ్ పోలీసులు తనను లాకప్‌లో వేశారు, అంటే అరెస్ట్ చేసినట్లేనని, తన స్టేట్మెంట్ తీసుకుని దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన స్టేట్మెంట్ రికార్డు చేస్తే కేసు పెట్టిన యువతులకు కూడా న్యాయం జరుగుతుందని రవీంద్ర గుర్తు చేశారు. తనను అరెస్ట్ చేయ్యకుంటే కోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. ఇప్పటికే బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్, డీసీపీ రవికాంత్‌గౌడ, హైగ్రౌండ్స్ ఎస్ఐ రవిలపై కబ్బన్‌పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రవీంద్ర అన్నారు. హోం మంత్రి జార్జ్‌పై తనకు పూర్తి నమ్మకుందని, ఈ కేసు దర్యాప్తునకు రెండు మూడు రోజులు చాలని ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్ వాపోయారు. దద్దరిల్లిన టౌన్‌హాల్ తక్కువ కులానికి చెందిన వాడని ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్‌పై కక్ష సాధిస్తున్నారని ఆరోపిస్తూ పలు సంఘాలు శనివారం టౌన్‌హాల్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ప్రజా పరివర్తన వేదిక, దళిత సంఘర్షణ సమితి, సమతా సైనికదళ, కర్ణాటక జనాందోళన సంఘటన తదితర సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దళితుడు అనే భావనతో ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్‌పై కక్ష సాధిస్తున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్, డీసీపీ రవికాంత్‌గౌడ, ఎస్ఐ రవిలను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రవీంద్రనాథ్‌కు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. -
నలుగురిని బలిగొన్న ‘వడ్డీ’ వ్యాపారం!
విజయవాడ, న్యూస్‌లైన్ : ‘అధిక వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాను.. నా భార్య పేరిట ఉన్న ఆస్తి ఇమ్మని వేడుకున్నా.. పిల్లల ముఖం చూసైనా ఇవ్వండి అన్నా.. అత్త వెంకటేశ్వరమ్మ, బావమరిది గోపాలకృష్ణ ఇవ్వకపోగా వేధింపులకు గురిచేస్తున్నారు. కొద్ది రోజులుగా మనస్థాపానికి గురైన మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం. అత్త, బావమరిదిపై కఠిన చర్యలు తీసుకోండి’ అంటూ కుటుంబం సహా ఆత్మహత్యకు పాల్పడిన రాము రాసినట్టుగా చెపుతున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని గులాబీతోట నేతాజీ రోడ్డుకు చెందిన పిన్నింటి రాము (29) చుట్టుగుంట అల్లూరి సీతారామరాజు వంతెన సమీపంలో శ్రీసాయి బాలాజీ పెరల్స్ అండ్ బెంటెక్స్ షాపు నిర్వహిస్తున్నాడు. ఏడేళ్ల కిందట మచిలీపట్నానికి చెందిన లతతో అతనికి వివాహమైంది. కొద్దిరోజులకే వీరి మధ్య మనస్ఫర్థలు రావడంతో విడిపోయారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ఏప్రిల్ నాలుగున కోర్టు వాయిదా ఉన్నట్టు చెపుతున్నారు. వారు విడిపోయిన తర్వాత అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన భాగ్యలక్ష్మి (25)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు యశ్వంత్ (5), రోషిణి (3). సీతారామరాజు వంతెన సమీపంలోనే తల్లిదండ్రులు, సోదరులు ఉంటున్నా.. భార్యతో కలిసి గులాబీతోటలో రాము ఉంటున్నాడు. షాపు సమీపంలో అవసరం కోసం వచ్చే వారి వద్ద బంగారు నగలు కుదువ పెట్టుకొని వడ్డీలకు డబ్బులు ఇస్తుంటాడు. వీరి వద్ద తీసుకున్న నగలు పాతబస్తీలో కుదువ పెడుతున్నట్టు పలువురు చెపుతున్నారు. ఇటీవల కొంతకాలంగా నగలు కుదువ పెట్టిన పలువురు తీసుకునేందుకు రాగా.. ఎన్నికల తర్వాత ఇస్తానంటూ చెప్పసాగాడు. అనేక మంది తమ వద్ద డబ్బులు అయిపోతాయని చెప్పినా, ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేయసాగాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఆరు గంటలైనా ఇంట్లోనుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా విగతజీవులై పడివున్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న సెంట్రల్ జోన్ ఏసీపీ కె.లావణ్య లక్ష్మి, మాచవరం ఇన్స్పెక్టర్ పి.మురళీకృష్ణారెడ్డి హుటాహుటిన సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు. అధిక వడ్డీలే కారణమా రాము ఇక్కడి పలువురు మహిళల నుంచి నగలు తీసుకొని పాతబస్తీలో కుదువ పెట్టి సొమ్ము తీసుకొచ్చి ఇస్తుంటాడు. వీరు అడిగిన మొత్తం కంటే ఎక్కువ తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో వడ్డీ చెల్లించిన వారి నగలు తీసుకొచ్చేందుకు కాల్‌మనీ వ్యాపారులను ఆశ్రయించి ఉండొచ్చని తెలుస్తోంది. లేదా అక్కడ తీసుకొచ్చిన మొత్తంతో భారీ ఎత్తున కాల్‌మనీ వ్యాపారం చేసి ఉంటాడని, ఇటీవల పోలీసుల చర్యలతో అప్పులు ఇచ్చిన వాళ్లు తిరిగి చెల్లించి ఉండకపోవచ్చని స్థానికులు చెపుతున్నారు. దీంతో కుదువపెట్టిన నగలు విడిపించలేని స్థితిలో వాయిదాలు వేస్తూ వచ్చి ఉండొచ్చని.. ఈలోగా భార్య వాటాగా వచ్చిన స్థలాలు అమ్మేసి అప్పులు తీర్చేద్దామని నిర్ణయించుకుని ఉంటాడని భావిస్తున్నారు. వెంటనే ఆస్తులు అమ్మి సొమ్ము ఇచ్చేందుకు అత్తింటి వారు అంగీకరించకపోవడంతో పిల్లలు, భార్య సహా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని చెబుతున్నారు. రాము ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పడు తమ పరిస్థితేమిటని నగలు కుదువపెట్టిన బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.