పెట్రోల్ బంక్‌ల యూనియన్ వెల్లడి
గుంటూరు రూరల్: డీలర్ మార్జిన్‌కు సంబంధించి 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అపూర్వచంద్ర కమిటీ నివేదికను ఇప్పటికీ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 19, 26 తేదీల్లో సాయంత్రం 7 గంటల నుంచి 8 వరకు పెట్రోల్ బంక్‌లను మూసివేయనున్నట్లు పెట్రోల్ బంక్‌ల అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు.శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 3, 4 తేదీల్లో పెట్రోల్ కొనుగోలును నిలిపివేస్తామని చెప్పారు.
నవంబర్ 5న సాయంత్రం 6 వరకు మాత్రమే బంక్‌లు తెరిచి ఉంటాయని, అనంతరం బంద్ పాటించనున్నట్లు వెల్లడించారు. 6న పూర్తిగా బంద్ చేస్తామన్నారు.నవంబర్ 7 నుంచి ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రమే బంక్‌లను నిర్వహించాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి నెలలో 2, 4వ శనివారాలు, అలాగే ప్రతి ఆదివారం సెలవు దినాలుగా కమిటీ నిర్ణయించిందన్నారు.
19, 26న గంటపాటు పెట్రోలు బంక్‌ల బంద్
Published Sun, Oct 9 2016 1:15 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement