పెద్ద నోట్లతో పరేషాన్!
కేంద్రం నిర్ణయంతో నిరాకరణ
పాత నోట్లు చెల్లవంటూ ప్రచారం
అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం
చిల్లర కోసం పలుచోట్ల వాగ్వాదాలు
హన్మకొండ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం అన్ని రకాల లావాదేవీల విషయంలో గందరగోళం నెలకొంది. రూ.500, రూ.1000 నోట్లను తీసుకునేందుకు నిరాకరించారు. పాత నోట్లను బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో డిసెంబర్ 30లోగా మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఇకపై ఈ నోట్లు పనికిరావనే అపోహ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారమైంది.
బంకులు, హోటళ్లలో...
వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని నర్సంపేట, పరకాల పట్టణాలతోపాటు వివిధ మండలకేంద్రాల్లో హోటళ్లలో భోజనం తినేందుకు వచ్చిన వారిని యజమానులు ముందే చిల్లర అడిగారు. రూ.500, రూ.1000నోట్లను నిరాకరించారు. చిన్న, పెద్ద వ్యాపారాలు రోజూ జరిగే సాధారణ స్థితితో పోల్చితే చాలావరకు తగ్గారుు. పెట్రోల్ బంకుల్లోనూ రూ.100 నోట్ల కొరతతో రూ.500 ఇస్తే పూర్తి మొత్తానికి మాత్రమే డీజిల్, పెట్రోలు పోస్తున్నారు. బంకుల్లో చిల్లర కోసం ప్రతి ఒక్కరూ రూ.500 ఇస్తుండటంతో బంకు సిబ్బంది, వాహనదారులకు వివాదాలు చోటుచేసుకున్నారుు.
మార్కెట్లలో రైతుల నిరాకరణ
పెద్ద నోట్ల విషయం రైతులను మరింత గందరగోళానికి గురిచేసింది. జిల్లాలోని పరకాల, నర్సంపేట, గూడెప్పాడ్, నెక్కొండ, వర్ధన్నపేట మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులు విక్రరుుంచిన రైతులు రూ.500, రూ.1000 నోట్లు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో వ్యాపారులకు, రైతులకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నారుు. చేసేది లేక రైతుల చెల్లింపులకు సంబంధించి వ్యాపారులు వారుుదా వేశారు. కొత్తనోట్లు వచ్చిన తర్వాత చెల్లించేలా రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే నగదు ఇవ్వకున్నా నోట్ల విషయంలో ఇబ్బందులు పడొద్దని రైతులు ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వరికోతల సీజన్ కావడంతో వరికోత యంత్రాలు సైతం నిలిచిపోయారుు.
రైతు కూలీలు సైతం రూ.500, రూ.1000నోట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ప్రతిఒక్కరూ చిన్న నోట్లకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఒక్క నర్సంపేట పట్టణంలో మాత్రమే లెసైన్సు ఉన్న ఫైనాన్‌స సంస్థలు 4 ఉన్నారుు. వీటిల్లో ఒక్కో దాంట్లో రోజూ రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు రుణాలు ఇస్తుంటారు. కేంద్రం నిర్ణయంతో ఈ సంస్థల నుంచి రైతులు ఒక్క రూపారుు కూడా తీసుకోలేదు. రైతులు, ఇతర ప్రజలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.