The old banknotes
-
డిసెంబర్ 31
డెడ్ లైన్ ఈయన్ని చూడండి. చేతిలో డబ్బుంది. ముఖంలో సంతోషం లేదు. పేరు ఆర్.కె.అగర్వాల్. ఉంటున్నది లక్ష్మీనగర్... న్యూ ఢిల్లీ. డిసెంబర్ 31 గుర్తొస్తేనే అగర్వాల్‌కు నిద్రపట్టడం లేదు. ఆ తేదీ లోపు పాత నోట్లను వదిలించుకోవాలని దేశమంతా తొందరపడుతుంటే అగర్వాల్ మాత్రం... ఆ తేదీ తర్వాత ఇక పాత నోట్లు కనిపించవు కదా అని (చెల్లవు కదా అని కాదు!) బెంగ పెట్టేసుకున్నారు! అగర్వాల్ దగ్గర ప్రస్తుతం లక్షన్నర రూపాయల విలువైన 500 నోట్లు, 1000 నోట్లు ఉన్నాయి. వాటిని చేజార్చుకోడానికి ఆయన ఇష్టంగా లేరు. అందుకే ఇంతవరకు వాటిని మార్చుకోవడానికి బ్యాంకుకు వెళ్లలేదు! బ్రిటిష్ ఇండియా నాటి కరెన్సీ నోట్లు కూడా అగర్వాల్ దగ్గర ఉన్నాయి. బర్మా కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసి ఇచ్చిన పది రూపాయల నోటు కూడా వాటిల్లో ఉంది. 1947 వరకు బర్మాకు ఆర్.బి.ఐ.యే బ్యాంకర్ కాబట్టి ఆ దేశానికి కావలసిన కరెన్సీని ముద్రించి పంపేది. ఇక అన్నిటిలోకి అగర్వాల్ గర్వంగా చూపించుకునేది.. ఆర్.బి.ఐ. గవర్నర్ బి.ఎన్.అడార్కర్ సంతకంతో ఉన్న 1970 నాటి 5 రూపాయల నోటు. అడార్కర్ 42 రోజులు మాత్రమే ఆర్.బి.ఐ.గవర్నర్‌గా ఉన్నారు. అందుకే అగర్వాల్‌కు అది అంత అపురూపం. అగర్వాల్ వయసు 63 ఏళ్లు. గత 30 ఏళ్లుగా రకరకాల అరుదైన కరెన్సీని కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు. పోనీ ఈ వెయ్యీ, ఐదొందల నోట్లలో ఒకటీ రెండు నోట్లను దాచుకుని మిగతావాటిని మార్చుకోవచ్చు కదా! నిజమే కానీ, అసలు అంత అందమైన ఫైవ్ హండ్రెడ్, థౌంజడ్ రుపీ నోట్స్ రద్దు కావడమే ఆయనకు ఇష్టం లేదట. ‘‘చూస్తాను, ఇప్పటికైతే వాటిల్లో ఒక్క నోటును మార్చుకోవడానికైనా నాకు మనస్కరించడం లేదు’’ అంటున్నారు అగర్వాల్. ఇంకో వారంలో నోట్ల మార్పిడి డెడ్‌లైన్ ముగుస్తుంది. చూడాలి. ఆర్.బి.ఐ. నోటు విలువైనదో? నోటుతో అగర్వాల్ అనుబంధం విలువైనదో? -
డబ్బేమైంది..!
జిల్లాకు వచ్చిన రూ.315 కోట్ల కొత్త నోట్లు అయినా ఏటీఎంలలో డబ్బుల కొరత గంటపాటే పనిచేస్తున్న మిషన్లు సెలవు రోజుల్లో మూతే బ్యాంకుల్లోనూ తప్పని తిప్పలు పాత నోట్లు రద్దయి నలభై రోజులు కావస్తున్నాయి. అధికార యంత్రాంగం కోరినదాంట్లో సుమారుగా రూ. 315 కోట్లు జిల్లాకు కొత్త నోట్లు వచ్చాయి. ఇంకా ఏటీఎంల వద్ద జనం బారులు తీరుతున్నారు. పని రోజుల్లో గంటపాటు ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండగా.. సెలవు రోజుల్లోనైతే అసలు తెరవడమే లేదు. బ్యాంకులకు వెళ్తున్న ఖాతాదారులందరికీ నిర్దేశించిన డబ్బులు కూడా అందడం లేదు. మరి జిల్లాకు వచ్చిన కొత్త నోట్లు ఏమైనట్లు..? ప్రజలకు ఇది శేష ప్రశ్నగా మారింది. నిజామాబాద్‌అర్బన్ : కేంద్ర ప్రభుత్వం పాత రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో జిల్లాకు రూ.350 కోట్లు కొత్తవి పంపాలని అధికారం యంత్రాంగం ఆర్థికశాఖకు ప్రతిపాదించింది. ఇప్పటివరకు జిల్లాకు రూ.315 కోట్లకుపైగా కొత్తనోట్లను బ్యాంకులకు పంపిణీ చేసి నగదును అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే సామాన్య జనానికి డబ్బులు మాత్రం అందడంలేదు.. సెలవులు వస్తే ఏటీఎంలు మూత పడుతున్నాయి. పని రోజుల్లో గంటపాటు ఏటీఎంలలో డబ్బులు ఉంటున్నాయి. జిల్లాలో 356 బ్యాంకులు, 342 ఏటీఎంలు ఉన్నాయి. వివిధ బ్యాంకుల ద్వారా నగదును ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కోట్లాది రూపాయలు వచ్చినా.. సామాన్యుడికి అందకపోవడం వెనుక పక్కదారి పట్టడమే ప్రధాన కారణమంటున్నారు. బ్యాంకులలో నగదు విత్ డ్రాకు నిబంధనలు అమల్లో ఉన్నాయి. సామాన్య జనం డబ్బుల కోసం ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నిత్యావసరాలు, శుభకార్యాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర వ్యాపారపరంగా అవసరాలు, రైతులు పెట్టుబడికి డబ్బులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో ఏటీఎంలు మూతపడ్డాయి. పింఛన్ల కోసం వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలు ఇంకేన్ని రోజులు ఉంటాయోనని ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల ద్వారా రూ.10 వేల నగదు అందిస్తామన్న ప్రభుత్వ నిర్ణయం సక్రమంగా అమలు కావడంలేదు. నేటివరకూ కొందరు ఉద్యోగులకు డబ్బులు అందలేదు. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రంగాల్లోని బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లకు బ్యాంకుల నుంచి నేరుగా నోట్ల మార్పిడి జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయల నోట్ల మార్పిడిలో బ్యాంకు అధికారులదే పెద్దన్న పాత్ర. నల్లధన కుబేరులు, దళారుల వ్యవహారమే కొనసాగింది. బ్యాంకుల నుంచి డబ్బులను మధ్యవర్తులు పొంది 30 శాతం కమీషన్‌తో నోట్ల మార్పిడికి తెగబుతున్నట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు, పరిశీలనలు చేపడితే ఖచ్చితంగా అక్రమాలు వెలుగులోకి వచ్చేవని జానాభిప్రాయం. కాగా జిల్లాలో నల్లధనం బయట పడకపోవడం మిస్టరీగా మారింది. అక్రమ ఆస్తులు, ఆదాయంపై ఐటీశాఖ స్పందన కనిపించడం లేదంటున్నారు. -
కమీషన్ దళారులపై నిఘా
నల్లధనాన్ని మార్చేవారిపై కఠిన చర్యలు ప్రతి ఒక్కరూ మొబైల్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి డిసెంబరు నుంచి రేషన్‌షాపుల్లో పప్పు, నూనె ఉద్యోగుల జీతాలు, పింఛన్ల పంపిణీ యథాతథం ప్రెస్మీట్లో జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ తిరుపతి: పెద్ద నోట్లు రద్దరుున నేపథ్యంలో పాత నోట్లకు కమీషన్ పద్ధతిలో కొత్తనోట్లు అందజేసే దళారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు రంగ ప్రవేశం చేసి కమీషన్ పద్ధతి వ్యాపారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందనీ, జిల్లా వ్యాప్తంగా అటువంటి ప్రాంతాలనూ, వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పీలేరులో నల్లధనాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తూ కొందరు పోలీసుల చేతికి చిక్కిన వైనాన్ని వివరిస్తూ నల్లధనాన్ని వెలికి తీయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు, యూనివర్సిటీ వీసీలతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ నగదు రహిత లావాదేవీల నిర్వహణపై చర్చిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ- పోస్, ఈవాలెట్ పద్దతులను ప్రవేశ పెడుతున్నామన్నారు. మొబైల్ బ్యాంకింగ్ సేవలను జిల్లా వ్యాప్తంగా విసృ్తతం చేస్తున్నామన్నారు. జిల్లా అంతటా స్మార్ట్ సర్వే 90 శాతం పూర్తరుు్యందన్నారు. ఈనెల చివరి వారంలో వివరాల నమోదుకు మరో అవకాశం కల్పిస్తున్నామనీ, సర్వే సమయంలో ఇళ్లల్లో లేని వారు ఈ వారంలో కుటుంబ వివరాలను నమోదు చేరుుంచుకోవాలని సూచించారు. డేటా వివరాలను డిసెంబరు మొదటి వారంలో ప్రచురిస్తామని కలెక్టర్ చెప్పారు. నోట్ల రద్దు తరువాత జిల్లాలో బ్యాంకింగ్ నిపుణుల ద్వారా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటి వరకూ రూ.500 కోట్ల నగదును పంపిణీ చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్ల డబ్బు పంపిణీ జరిపించామన్నారు. వంద రూపాయల నోట్లు 31 లక్షల వరకూ జిల్లాకు అందాయనీ, జిల్లాలో నెలకొన్న చిల్లర సమస్య త్వరలోనే చక్కబడుతుందన్నారు. రైతులకు బ్యాంకుల ద్వారా రూ.50 వేలు విత్‌డ్రా చేసుకునే సదుపాయంతో పాటు నరేగా నిధులను కూడా విడుదల చేయడం జరిగిందన్నారు.రేషన్ షాపుల్లో ఈ-పోస్ విధానాన్ని పూర్తిస్థారుులో అమలు పరుస్తున్నామన్నారు. డిసెంబరు మాసం నుంచి రేషన్ షాపులను మాల్స్ మాదిరిగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనీ, కందపప్పు, నూనె,ఉల్లిపాయలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 797 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను గ్రామీణ ప్రాంతాలకు పంపి వారి ద్వారా మొబైల్ బ్యాంకింగ్‌ను అలవాటు చేరుుంచనున్నామన్నారు. డిసెంబరు మొదటి వారంలో పింఛన్లు, ఉద్యోగుల జీతాలు యధావిధిగానే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కొన్ని పోస్టాఫీసుల్లో నగదు లావాదేవీలు సరిగా లేవని ఫిర్యాదులు వస్తున్నాయనీ, అటువంటి వాటిని గుర్తించి బ్లాక్‌లిస్టులో పెడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సంబంధించిన 593 బ్రాంచీలు ఉన్నాయనీ, మొత్తం 40 లక్షల ఖాతాలకు గాను 700 వరకూ ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాకు మరో 19,797 స్వైపింగ్ మిషన్లు అవసరమని నిర్ణరుుంచామనీ, త్వరలోనే అవి జిల్లాకు వస్తాయన్నారు. ఈపోస్ యంత్రాల వాడకం పెరగడంతో సర్వర్లపై పెరిగిన లోడ్‌ను తగ్గించేందుకు సాంకేతిక నిపుణులతో చర్చిస్తామన్నారు. -
నల్ల‘మందు’తో తెల్ల‘ధనం’
► బెల్టుబాబు డెరైక్షన్.. సిండికేట్ సభ్యుల యాక్షన్ ► మద్యం సిండికేటు నయాదందా ► మూడు రోజులుగా పాతనోట్లు తీసుకోని లిక్కర్ వ్యాపారులు ► కానీ ఆదాయ లెక్కల్లో.. బ్యాంకు జమల్లో మాత్రం అవే ► బ్లాక్‌ను వైట్ చేసుకునే పనిలో బిజీబిజీ పాత రూ.500, రూ.వెయ్యి నోట్లు ఎక్కడా.. ఎవరూ తీసుకోకపోయినా.. వైన్ షాపులు, బార్లలో మాత్రం కళ్లకద్దుకొని తీసుకున్నారు. బోర్డులు పెట్టి మరీ ఆహ్వానించి మందుబాబులను ఊరించారు.. ఆదాయం కిక్కు పెంచుకుందమనుకున్నారు.. నోట్లు రద్దయిన రెండు మూడు రోజుల వరకు అదే జరిగింది కూడా..కానీ ఆ తర్వాతే సీను మారిపోయింది. మందుబాబులకు బంపర్ ఆఫర్ అందకుండాపోయింది. లిక్కర్ వ్యాపారులు పాత నోట్లు తీసుకోవడం మానేశారు..ఉన్న పళంగా వారి వైఖరిలో ఈ మార్పునకు కారణమేంటి?!.. ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశాలే వెలుగుచూశాయి.దాని వెనుక ఓ బెల్టుబాబు మాస్టర్‌మైండ్ ఉందని.. అందులో నల్లడబ్బును మద్యంలో ముంచి తెల్లగా మార్చేసుకోవాలన్న స్వార్థపూరిత ఆలోచనలున్నాయని తేటతెల్లమైంది.మన దగ్గరే గుట్టలు గుట్టలుగా పాత పెద్దనోట్లు ఉండగా.. జనం నుంచి తీసుకోవడమెందుకు?.. వారి నుంచి కొత్త నోట్లే తీసుకొని.. వాటి స్థానంలో పాత నోట్లను చెల్లుబాటు చేసుకోవాలన్న దురాలోచన ఆ బెల్లుబాబుదే.. ఫలితం.. సిండికేట్ పరిధిలోని షాపులవారు పాత నోట్లకు ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను వెనక్కి తీసేసుకున్నారు. -సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం విశాఖపట్నం: నోట్ల కట్టలు.. గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి.. ఇప్పుడవన్నీ బయట చెల్లుబాటు కావు. ఈ బ్లాక్‌ను ఎలా వైట్ చేసుకోవాలి?!.. ప్రధాని ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇదే విషయమై మథనపడిన నగరంలోని లిక్కర్ సిండికేట్ లీడరు అలియాస్ టీడీపీ ప్రజాప్రతినిధి అలియాస్ బెల్టుబాబుకు ఎట్టకేలకు మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే తనవారందరికీ మార్గదర్శనం చేశారట. వైన్‌షాపులు, బార్లలో ఇక వినియోగదారుల నుంచి పాత రూ.500, వెయ్యి నోట్లు తీసుకోకుండా కొత్త 2వేల రూపాయల నోటు, లేదా రూ.వంద100, రూ.50 నోట్లు మాత్రమే తీసుకోవాలని లోపాయికారీగా ఆదేశాలు జారీ చేశారు. అలా వచ్చే రోజూవారీ వసూళ్ల స్థానంలో పాత నోట్ల కట్టలను తీసుకొచ్చి ఆదాయం లెక్కల్లోచూపించేస్తే.. బ్లాక్‌లో ఉన్న కొంత సొమ్మయినా వైట్ చేసుకునే వీలుంటుందని సదరు బెల్టుబాబు లెక్కట. అందుకే ఇప్పుడు నగరం, నగర శివారులోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో కొత్త నోట్లు మాత్రమే తీసుకుంటామని బోర్డులు పెడుతున్నారు. వాస్తవానికి ఈ నెల 8వ తేదీ రాత్రి కేంద్రం రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆయా నోట్లను తీసుకునేది లేదంటూ బోర్టులు పెట్టేశాయి. కానీ విశాఖ నగరం, శివారులోని మద్యం షాపులు, బార్ల యజమానులు మాత్రం పాత నోట్లను తీసుకుంటామని బోర్డులు పెట్టి మరీ మందుబాబులను ఆహ్వానించారు. బ్లాక్ టు వైట్‌కు ఇదే అదను.. నగరంలోని లిక్కర్ వ్యాపారుల తరఫున దళారీగా వ్యవహరించే సదరు టీడీపీ ప్రజాప్రతినిధి నల్లధనాన్ని వైట్ చేసుకోవాలంటే ఇదే సరైన సమయమని భావించాడు. అందుకే రోజూవారీ ఆదాయంలో భాగంగా పాత నోట్లను తీసుకోకుండా కేవలం కొత్త రూ.2వేల నోట్లు, వందలు, యాభైలు, చిల్లర మాత్రం తీసుకోవాలని సిండికేట్ వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశాడని అంటున్నారు. రోజువారీ లావాదేవీల్లో వచ్చే సొమ్మును ఎలాగూ ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం గొడౌన్లోనో.. బ్యాంకుల్లోనో చెల్లిస్తారు కనుక వైట్ అయిపోతుందన్నది ఆయనగారి వ్యూహం. ఆ మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి నగరంలోని అన్ని మద్యం దుకాణాల వద్ద పాతనోట్లు చెల్లవని బోర్డులు పెట్టేశారు. విశాఖ, నగర శివారుల్లో కలిపి దాదాపు 110 మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. సగటున రోజుకి ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల విక్రయాలు జరుగుతుంటాయని అంచనా. వాస్తవానికి గత వారంరోజులుగా సరైన విక్రయాలు లేక రోజూవారీ ఆదాయం ఒకింత తగ్గింది. అయితే రోజూవారీ ఆదాయం పది కోట్లుపైగా చూపిస్తూ ఇప్పటికే భారీమొత్తంలో బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారని చెబుతున్నారు. బెల్టుబాబుతో సహా సిండికేట్ సభ్యులు దాచుకున్న మొత్తం సొమ్ము వైట్ చేసుకోలేకపోయినా.. కొంతలో కొంత మార్పిడి చేసుకునేందుకు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. సహజంగానే బెల్టుబాబు అలియాస్ టీడీపీ ప్రజాప్రతినిధి దెబ్బకు.. వైన్‌షాపుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకోవడం తప్ప మిగిలిన వాటి జోలికిపోని ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు కూడా ఏమీ తెలియనట్లే నిద్ర నటిస్తున్నారు. -
పెద్ద నోట్లతో పరేషాన్!
కేంద్రం నిర్ణయంతో నిరాకరణ పాత నోట్లు చెల్లవంటూ ప్రచారం అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చిల్లర కోసం పలుచోట్ల వాగ్వాదాలు హన్మకొండ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం అన్ని రకాల లావాదేవీల విషయంలో గందరగోళం నెలకొంది. రూ.500, రూ.1000 నోట్లను తీసుకునేందుకు నిరాకరించారు. పాత నోట్లను బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో డిసెంబర్ 30లోగా మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఇకపై ఈ నోట్లు పనికిరావనే అపోహ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారమైంది. బంకులు, హోటళ్లలో... వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని నర్సంపేట, పరకాల పట్టణాలతోపాటు వివిధ మండలకేంద్రాల్లో హోటళ్లలో భోజనం తినేందుకు వచ్చిన వారిని యజమానులు ముందే చిల్లర అడిగారు. రూ.500, రూ.1000నోట్లను నిరాకరించారు. చిన్న, పెద్ద వ్యాపారాలు రోజూ జరిగే సాధారణ స్థితితో పోల్చితే చాలావరకు తగ్గారుు. పెట్రోల్ బంకుల్లోనూ రూ.100 నోట్ల కొరతతో రూ.500 ఇస్తే పూర్తి మొత్తానికి మాత్రమే డీజిల్, పెట్రోలు పోస్తున్నారు. బంకుల్లో చిల్లర కోసం ప్రతి ఒక్కరూ రూ.500 ఇస్తుండటంతో బంకు సిబ్బంది, వాహనదారులకు వివాదాలు చోటుచేసుకున్నారుు. మార్కెట్లలో రైతుల నిరాకరణ పెద్ద నోట్ల విషయం రైతులను మరింత గందరగోళానికి గురిచేసింది. జిల్లాలోని పరకాల, నర్సంపేట, గూడెప్పాడ్, నెక్కొండ, వర్ధన్నపేట మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులు విక్రరుుంచిన రైతులు రూ.500, రూ.1000 నోట్లు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో వ్యాపారులకు, రైతులకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నారుు. చేసేది లేక రైతుల చెల్లింపులకు సంబంధించి వ్యాపారులు వారుుదా వేశారు. కొత్తనోట్లు వచ్చిన తర్వాత చెల్లించేలా రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే నగదు ఇవ్వకున్నా నోట్ల విషయంలో ఇబ్బందులు పడొద్దని రైతులు ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వరికోతల సీజన్ కావడంతో వరికోత యంత్రాలు సైతం నిలిచిపోయారుు. రైతు కూలీలు సైతం రూ.500, రూ.1000నోట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ప్రతిఒక్కరూ చిన్న నోట్లకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఒక్క నర్సంపేట పట్టణంలో మాత్రమే లెసైన్సు ఉన్న ఫైనాన్స సంస్థలు 4 ఉన్నారుు. వీటిల్లో ఒక్కో దాంట్లో రోజూ రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు రుణాలు ఇస్తుంటారు. కేంద్రం నిర్ణయంతో ఈ సంస్థల నుంచి రైతులు ఒక్క రూపారుు కూడా తీసుకోలేదు. రైతులు, ఇతర ప్రజలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. -
‘మార్పిడి’ కష్టాలు
cancellation of the two days of big money troubleపడ్డ ప్రజలకు కాస్త ఊరట లభించింది. పాత నోట్లు తీసుకుని అన్ని బ్యాంకులు, ప్రధాన పోస్టాఫీసుల్లో గురువారం కొత్త నోట్లు ఇచ్చారు. అరుుతే ఇందుకోసం ప్రజలు ఉదయం నుంచే ఆయా బ్యాంకు శాఖల వద్ద క్యూకట్టారు. గంటల తరబడి లైనులో ఉండడంతో కొన్నిచోట్ల తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గుర్తింపు కార్డుతోపాటు భారీగా నగదుతో వచ్చినా కేవలం రెండు రూ.2 వేల నోట్లు మాత్రమే ఇచ్చారు. - సాక్షి, సిటీబ్యూరో మా నోటు మారేదెట్టా బాబయ్యా! నోట్ల మార్పిడి సంచార జీవులకు కష్టంగా మారింది. ఈ చిత్రంలో కనిపిస్తున్నవారు వీధివీధి తిరిగుతూ.. కూడళ్లలో బిచ్చమెత్తుకుని బతికేవారు. దారినపోయేవారు ధర్మంగా వేసిన రూపారుు, రూపారుు కూడబెట్టి చిల్లర మొత్తాన్ని పెద్ద నోట్లుగా మార్చుకున్నారు. ఇప్పుడు రూ.500 నోట్లు చెల్లవు అనేసరికి.. తమవద్దనున్న నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక వివిల్లాడుతున్నారు. ‘మా నోట్లు చెల్లవా’.. అంటూ అమయకంగా ప్రశ్నిస్తున్నారు. తాము అడుక్కుని సంపాదించిన చిల్లరను ఇచ్చి నోట్లు తీసుకున్నామని, ఇప్పుడు ఇవి ఎంచేయాలని దారినపోయేవారిని అమాయకంగా అడుగుతున్నారు. ఏ బ్యాంకుకు వెళ్లాలి.. ఎక్కడ మార్చుకోవాలో చెప్పాలంటూ ప్రాధేయపడుతున్నారు. - కుత్బుల్లాపూర్