కమీషన్ దళారులపై నిఘా
నల్లధనాన్ని మార్చేవారిపై కఠిన చర్యలు
ప్రతి ఒక్కరూ మొబైల్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి
డిసెంబరు నుంచి రేషన్‌షాపుల్లో పప్పు, నూనె
ఉద్యోగుల జీతాలు, పింఛన్ల పంపిణీ యథాతథం
ప్రెస్‌మీట్‌లో జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్
తిరుపతి: పెద్ద నోట్లు రద్దరుున నేపథ్యంలో పాత నోట్లకు కమీషన్ పద్ధతిలో కొత్తనోట్లు అందజేసే దళారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు రంగ ప్రవేశం చేసి కమీషన్ పద్ధతి వ్యాపారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందనీ, జిల్లా వ్యాప్తంగా అటువంటి ప్రాంతాలనూ, వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పీలేరులో నల్లధనాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తూ కొందరు పోలీసుల చేతికి చిక్కిన వైనాన్ని వివరిస్తూ నల్లధనాన్ని వెలికి తీయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు, యూనివర్సిటీ వీసీలతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ నగదు రహిత లావాదేవీల నిర్వహణపై చర్చిం చారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ- పోస్, ఈవాలెట్ పద్దతులను ప్రవేశ పెడుతున్నామన్నారు. మొబైల్ బ్యాంకింగ్ సేవలను జిల్లా వ్యాప్తంగా విసృ్తతం చేస్తున్నామన్నారు. జిల్లా అంతటా స్మార్ట్ సర్వే 90 శాతం పూర్తరుు్యందన్నారు. ఈనెల చివరి వారంలో వివరాల నమోదుకు మరో అవకాశం కల్పిస్తున్నామనీ, సర్వే సమయంలో ఇళ్లల్లో లేని వారు ఈ వారంలో కుటుంబ వివరాలను నమోదు చేరుుంచుకోవాలని సూచించారు. డేటా వివరాలను డిసెంబరు మొదటి వారంలో ప్రచురిస్తామని కలెక్టర్ చెప్పారు. నోట్ల రద్దు తరువాత జిల్లాలో బ్యాంకింగ్ నిపుణుల ద్వారా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటి వరకూ రూ.500 కోట్ల నగదును పంపిణీ చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ల డబ్బు పంపిణీ జరిపించామన్నారు. వంద రూపాయల నోట్లు 31 లక్షల వరకూ జిల్లాకు అందాయనీ, జిల్లాలో నెలకొన్న చిల్లర సమస్య త్వరలోనే చక్కబడుతుందన్నారు. రైతులకు బ్యాంకుల ద్వారా రూ.50 వేలు విత్‌డ్రా చేసుకునే సదుపాయంతో పాటు నరేగా నిధులను కూడా విడుదల చేయడం జరిగిందన్నారు.రేషన్ షాపుల్లో ఈ-పోస్ విధానాన్ని పూర్తిస్థారుులో అమలు పరుస్తున్నామన్నారు. డిసెంబరు మాసం నుంచి రేషన్ షాపులను మాల్స్ మాదిరిగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనీ, కందపప్పు, నూనె,ఉల్లిపాయలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 797 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను గ్రామీణ ప్రాంతాలకు పంపి వారి ద్వారా మొబైల్ బ్యాంకింగ్‌ను అలవాటు చేరుుంచనున్నామన్నారు.
డిసెంబరు మొదటి వారంలో పింఛన్లు, ఉద్యోగుల జీతాలు యధావిధిగానే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కొన్ని పోస్టాఫీసుల్లో నగదు లావాదేవీలు సరిగా లేవని ఫిర్యాదులు వస్తున్నాయనీ, అటువంటి వాటిని గుర్తించి బ్లాక్‌లిస్టులో పెడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సంబంధించిన 593 బ్రాంచీలు ఉన్నాయనీ, మొత్తం 40 లక్షల ఖాతాలకు గాను 700 వరకూ ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాకు మరో 19,797 స్వైపింగ్ మిషన్లు అవసరమని నిర్ణరుుంచామనీ, త్వరలోనే అవి జిల్లాకు వస్తాయన్నారు. ఈపోస్ యంత్రాల వాడకం పెరగడంతో సర్వర్లపై పెరిగిన లోడ్‌ను తగ్గించేందుకు సాంకేతిక నిపుణులతో చర్చిస్తామన్నారు.