న్యాయమూర్తిగా...
మంచు లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు న్యాయమూర్తిగా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై వేళ్ల మౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెల 20న ప్రారంభం కానుంది. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ జరపనున్నాం. థ్రిల్లర్, కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం’’ అని చెప్పారు.