
తెలుగులో బిగ్‌బాస్ 8వ సీజన్.. ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఎవరెవరు హౌస్‌లోకి వెళ్తారనేది.. షో స్టార్ట్ కావడానికి కొన్నిరోజుల ముందు నుంచే గాసిప్స్ వస్తాయి. అలా ఈసారి రాజ్ తరుణ్ వెళ్తాడని ఒకటే మాట్లాడుకున్నారు. ఆల్రెడీ డిస్కషన్స్ కూడా అయిపోయాయని అన్నారు. కానీ ఇందులో నిజం లేదని తేలిపోయింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ సీజన్-8 ప్రసార తేదీని ప్రకటించిన స్టార్ మా)
రీసెంట్ టైంలో లావణ్య అనే అమ్మాయి వ్యవహారంలో వివాదంలో చిక్కుకున్న రాజ్ తరుణ్.. నెల క్రితం 'పురుషోత్తముడు', 'తిరగబడరా సామీ' సినిమాలతో వచ్చాడు. ఇప్పుడు 'భలే ఉన్నాడే' అనే మూవీతో సెప్టెంబరు 7న థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ జరిగింది. ఇందులోనే రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది.
ఈ ప్రశ్నని దర్శకుడు శివ సాయి వర్ధన్‌ని అడగ్గా.. రాజ్ తరుణ్ ఒక్క చోట కుదురుగా ఉండే వ్యక్తి కాదని, కాబట్టి ఆయనకు బిగ్ బాస్ షో అసలు సెట్ కాదు. అలానే ఆయన ఎప్పటికీ బిగ్ బాస్ హౌసులోకి వెళ్లడు అని అన్నాడు. దీనిబట్టి చూస్తే అసలు బిగ్ బాస్ షో అంటేనే రాజ్ తరుణ్‍కి ఇంట్రెస్ట్ లేనట్లు ఉంది. కానీ రూమర్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఆస్పత్రిలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. అభిమానులు ఇలా కూడా ఉంటారా?)
Comments
Please login to add a commentAdd a comment