బిగ్‌బాస్‌ సీజన్‌-8 ప్రసార తేదీని ప్రకటించిన స్టార్‌ మా | Bigg Boss Telugu Season 8 Streaming Dates Announced, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ సీజన్‌-8 ప్రసార తేదీని ప్రకటించిన స్టార్‌ మా

Published Tue, Aug 27 2024 1:21 PM | Last Updated on Tue, Aug 27 2024 1:57 PM

Bigg Boss Telugu 8 Announced Streaming Dates

అక్కినేని నాగార్జున  వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుని సరికొత్తగా బిగ్‌బాస్‌ సీజన్‌-8 మొదలు కానుంది. ఈమేరకు తాజాగా     స్టార్‌ మా అధికారికంగా ప్రసార తేదీలతో పాటు స్ట్రీమింగ్‌ సమయం ప్రకటించింది. సీజన్‌-8 నుంచి హోస్ట్‌గాఈ నాగార్జున తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని తాజాగా విడుదలైన పోస్టర్‌తో తేలిపోయింది.

సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు బిగ్‌బాస్‌ ప్రసారం కానుంది. అయితే, శనివారం, ఆదివారం మాత్రం రాత్రి 9 గంటలకు టెలీకాస్ట్‌ అవుతుంది. 

'ఈసారి బిగ్‌బాస్‌ సీజన్‌-8లో ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫన్‌, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు' అని నాగార్జున ఇప్పటికే చెప్పారు. అందుకే ఈ సీజన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సెప్టెంబరు 1 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి బిగ్‌బాస్‌-8 ప్రసారం అవుతుందని స్టార్‌ మా అధికారికంగా తెలిపింది. గత సీజన్‌ మాదిరే ఈసారి కూడా హాట్‌స్టార్‌లో 24/7 స్ట్రీమింగ్‌ అవుతుందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement