క్రైమ్ థ్రిల్లర్‌తో వస్తోన్న మిల్కీ బ్యూటీ.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్! | Tamannaah Bhatia Sikandar Ka Muqaddar OTT Platform And Release Date | Sakshi
Sakshi News home page

Tamannah Bhatia: ఓటీటీకి తమన్నా క్రైమ్ థ్రిల్లర్‌.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!

Published Fri, Nov 8 2024 4:46 PM | Last Updated on Fri, Nov 8 2024 4:57 PM

Tamannah Bhatia latest Thriller Movie Streaming On This Date

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మ ముంబయికి షిఫ్ట్ అయింది. దక్షిణాదిలో కేవలం ప్రత్యేక సాంగ్స్‌లో మాత్రమే కనిపిస్తోంది. గతేడాది జైలర్ మూవీ ఐటమ్‌ సాంగ్‌లో మెరిసిన తమన్నా.. ఇటీవల స్త్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌తో అదరగొట్టింది.

తాజాగా తమన్నా ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో తెరకెక్కించిన చిత్రం 'సికందక్‌ కా ముఖద్దర్'. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీకి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది.

నవంబర్‌ 29 నుంచి సికందర్‌ కా ముఖద్దర్‌ స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్‌ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ చిత్రంలో తమన్నాతో పాటు అవినాష్ తివారీ, జిమ్మీ షెర్గిల్, రాజీవ్ మెహతా, దివ్య దత్తా, జోయా అఫ్రోజ్ కీలక పాత్రల్లో నటించారు.

సికందర్ కా ముకద్దర్ కథేంటంటే..

స్పెషల్ 26, బేబీ, 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' వంటి చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ నీరజ్ పాండే ఈ క్రైమ్ థిల్లర్‌కు దర్శకత్వం వహించారు. ఈ కథలో రూ.60 కోట్ల విలువైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేశారు? దాన్ని వెతకడంతో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? దాదాపు 15 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో చివరికి ఏమైంది? ఆ కేసును పరిష్కరిస్తున్న పోలీసు ఆఫీసర్ చివరికి సక్సెస్ అయ్యాడా? లేదా? అన్నదే అసలు కథ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement