
బంగారు రథం లాగుతున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
సాక్షి, చెన్నై: పది నెలల పాలనలోనే.. పదేళ్ల ప్రగతి ముఖ్యమంత్రి అనే నినాదంతో సీఎం స్టాలిన్ పరిపాలనను కీర్తిస్తూ తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి తిరుత్తణి సుబ్రమణ్య స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి బంగారు రథాన్ని లాగారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. వెంకటేశ్ నాయుడు, భూపతి, దేవయ్య లింగయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తమిళనాడును అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి నిరంతర కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తమిళనాడు రాష్టం రాబోయే కాలంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి.. తమిళనాడులో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 40కి 40 స్థానాల్లో స్టాలిన్‌ను గెలిపించాలన్నారు. సీఎం స్టాలిన్‌ను దేశానికి ప్రధానిని చేసి దక్షిణాది నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకొనే ప్రయత్నం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment