ఎమ్మిగనూరు/టౌన్, న్యూస్‌లైన్: శ్రీనీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు మహా రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. హరోంహర.. భక్తజన సంరక్షక నామస్మరణంతో పట్టణం మారుమ్రోగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణ.. మంగళ వాయిద్యాలు.. భక్తజనం హర్షధ్వానాల మధ్య రథోత్సవం వైభవోపేతంగా సాగింది. దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామి దర్శనంతో తన్మయత్వానికి
లోనయ్యారు. ఉదయం స్వామి వారి ఆలయుంలో నీలకంఠడుకి పురోహితులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తేరుబజార్‌కు తీసుకొచ్చారు. అక్కడ స్వామి వారిని పీఠంపై అధిష్టింపజేసి హోమం నిర్వహించారు. పూర్ణకుంభంతో నైవేద్యం సవుర్పించి హోవుం చుట్టూ స్వామి వారిని ప్రదక్షిణ చేయించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తిని వుహారథంపై అధిష్టింపజేసి హారతిపట్టారు. అక్కడి నుంచి అశేష భక్తజన వాహిని నడుమ వుహారథం ముందుకు కదిలింది. రథాన్ని లాగి స్వామి కృపను పాత్రులయ్యేందుకు భక్తులు పోటీపడ్డారు. శ్రీవూర్కండేయుస్వామి ఆలయుం వద్దకు చేరుకున్న రథోత్సవం తిరిగి తేరుబజారు వరకు కొనసాగింది. ఉత్సవంలో జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పురోహితులు నిర్వహించిన విశిష్ట పూజా ఘట్టాలు, నందికోళ్ల సేవ , వుంగళ వారుుద్యాలు, గొరవయ్యల నృత్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రవూలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారుు.
ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయు ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి నేతృత్వంలో ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి, ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటైంది. కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వుంత్రాలయుం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రాలయం ఎంపీపీ సీతారామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వై.రుద్రగౌడ్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బి.వి.జయనాగేశ్వరరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బి.టి.నాయుడు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
మురిసిన ముక్కంటి
Published Sun, Jan 19 2014 4:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement