శ్రీశైలం: శ్రావణమాసం మూడో సోమవారం రోజున శ్రీ భ్రమరాంబాసమేతుడై శ్రీమల్లికార్జునస్వామి వెండిరథంపై కనువిందుగా దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలోనే వెండిరథంతో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి దక్షిణద్వారం వద్దకు చేర్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం ప్రారంభమైంది. దీనికి ముందుగా సహస్ర దీపాలంకరణ మండపంలో సోమవారాన్ని పురస్కరించుకుని సహస్ర దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.