సాక్షి, హైదరాబాద్ : గత రెండు రోజుల నుంచి వరుణుడు హైదారాబాద్‌ను విడవడం లేదు. శుక్రవారం ఈదురు గాలులతో బీభత్సం సృష్టించిన వర్షం ఆదివారం కూడా భాగ్యనగర వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తెల్లవారుజామున మూడు గంటల నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ఇబ్రహీంపట్నంలో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో సిటీవాసులు నిరాశకు గురవుతున్నారు. వారంతం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అంతేకాకుండా అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతాకుతలం అవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో వీటి కారణంగా వందలాది ఎకరాల పంట నీట మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయనగరంలో జిల్లాలో ఈదురుగాలుల ధాటికి పూరి గుడిసెలు, రేకుల షెడ్డులు ఎగిరిపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment